Google Chrome బ్రౌజర్‌‌ను వెంటనే అప్‌డేట్ చేసుకోవాలని హెచ్చరిక

ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ఉపయోగించే Google Chrome బ్రౌజర్‌లో సెక్యూరిటీ లోపాన్ని కనుగొన్నట్లు Imperva Red - సైబర్ సెక్యూరిటీ సంస్థ తెలిపింది.

Update: 2023-01-16 04:35 GMT
Google Chrome బ్రౌజర్‌‌ను వెంటనే అప్‌డేట్ చేసుకోవాలని హెచ్చరిక
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ఉపయోగించే Google Chrome బ్రౌజర్‌లో సెక్యూరిటీ లోపాన్ని కనుగొన్నట్లు Imperva Red - సైబర్ సెక్యూరిటీ సంస్థ తెలిపింది.దీని కారణంగా 2.5 బిలియన్లకు పైగా వినియోగదారుల డేటా ప్రమాదంలో ఉంది. క్రిప్టో వాలెట్లు, క్లౌడ్ ప్రొవైడర్ క్రెడెన్షియల్స్ వంటి సున్నితమైన ఫైల్‌లను దొంగలించడానికి అవకాశం ఉంటుందని ఆ సంస్థ పేర్కొంది. సిమ్‌లింక్ ద్వారా కంప్యూటర్‌లోని సున్నితమైన డేటా హ్యాకర్స్ బారిన పడే అవకాశం ఉందని సంస్థ హెచ్చరిస్తుంది. ఈ సమస్య నుంచి గట్టేక్కడానికి వినియోగదారులు తమ బ్రౌజర్‌ను అప్‌డేట్ చేసుకోవాలని సూచిస్తుంది. సిమ్‌లింక్ అనేది ఫైల్ షార్ట్‌కట్‌లు సృష్టించడానికి, సులభతరమైన విధంగా ఫైల్స్‌ను ఆపరేటింగ్ చేయడానికి ఉపయోగపడుతందని చూపిస్తు వినియోగదారుల డేటా హ్యాకింగ్‌కు గురయ్యే అవకాశం ఉందని సైబర్ సెక్యూరిటీ సంస్థ తెలిపింది.

Read more:

Honor launches MagicBook X 14 laptop in India

Tags:    

Similar News