Apple వైర్డ్ ఇయర్‌పాడ్‌లకు USB టైప్-C పోర్ట్

Apple కంపెనీ త్వరలో తన వైర్డ్ ఇయర్‌పాడ్‌లకు కొత్త సదుపాయాన్ని తీసుకురానున్నట్లు సమాచారం

Update: 2023-04-28 17:31 GMT

దిశ, వెబ్‌డెస్క్: Apple కంపెనీ త్వరలో తన వైర్డ్ ఇయర్‌పాడ్‌లకు కొత్త సదుపాయాన్ని తీసుకురానున్నట్లు సమాచారం. USB టైప్-సి ఆధారిత కనెక్టింగ్ ఆప్షన్‌ను తీసుకురానుంది. ఈ విషయాన్ని టిప్‌స్టర్ ట్విట్టర్‌లో షేర్ చేసింది. ఇప్పటికే కంపెనీ తన రాబోయే iPhone 15 సిరీస్‌‌లో ఇదే చార్జింగ్ ఆప్షన్ తీసుకురానుంది. ప్రపంచవ్యాప్తంగా అన్ని కంపెనీలు కూడా తమ డివైజ్‌లకు USB టైప్-సి చార్జింగ్ సదుపాయాన్ని అందించాలని నిర్ణయించాయి. Apple ప్రస్తుతం దాని వైర్డ్ ఇయర్‌బడ్‌లను లైట్నింగ్ కనెక్టర్ లేదా 3.5mm హెడ్‌ఫోన్ జాక్ అడాప్టర్‌తో విక్రయిస్తోంది. అన్ని డివైజ్‌లకు ఒకే విధమైన చార్జింగ్, కనెక్టింగ్ పోర్ట్‌ను ఇవ్వడం ద్వారా చార్జర్ సమస్య చాలా వరకు తీరుతుంది.

Tags:    

Similar News