రూ. 1000 కంటే తక్కువ ధరలో లభించే కిచన్ ఎలక్ట్రిక్ పరికరాలు ఇవే..
ఉదయం లేచినప్పటి నుంచి మహిళలు వంటగదిలో ఏదో ఒక పనిచేస్తూ అలసిపోతూ ఉంటారు.
దిశ, ఫీచర్స్ : ఉదయం లేచినప్పటి నుంచి మహిళలు వంటగదిలో ఏదో ఒక పనిచేస్తూ అలసిపోతూ ఉంటారు. ఉదయం లేవగానే టిఫిన్స్, మధ్యాహ్నం లంచ్, సాయంత్రం స్నాక్స్, నైట్ కి డిన్నర్. ఇలా ఏదో ఒకటి తయారు చేస్తూ అలిసిపోతారు. ఇంతలా కష్టపడుతున్న మహిళల పని సులభతరం చేసే 5 ఎలక్ట్రానిక్ పరికరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ - కామర్స్ ప్లాట్‌ఫారమ్ అమెజాన్‌లో గొప్ప తగ్గింపులతో ఈ పరికరాలను సొంతం చేసుకోవచ్చు.
BLLUEX పూరి / రోటీ మేకర్
ఇంట్లో రోటీ లేదా పూరీ తయారు చేయడం చాలా శ్రమతో కూడుకున్న పని. కానీ మీకు రోటీ మేకర్ ఉంటే, మీరు నిమిషాల వ్యవధిలో మొత్తం కుటుంబానికి సరిపడా రోటీలను తయారు చేయవచ్చు. మీరు ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ అమెజాన్‌లో 42 శాతం తగ్గింపుతో కేవలం రూ.454కే ఈ రోటీ మేకర్‌ని సొంతం చేసుకోవచ్చు.
ARDAKI గుడ్డు బాయిలర్
ఈ మిషిన్ తో ఏకకాలంలో 7 గుడ్లు ఉడకబెట్టవచ్చు. దాని సహాయంతో మీరు చాలా సమయాన్ని ఆదా చేయవచ్చు. ఈ గాడ్జెట్ అసలు ధర రూ. 999 అయినప్పటికీ, మీరు అమెజాన్ నుంచి 70 శాతం తగ్గింపుతో కేవలం రూ. 299 కి కొనుగోలు చేయవచ్చు.
నైఫ్ పీలర్ పోర్టబుల్
కూరగాయలను కట్ చేయడం లేదా పీల్ చేయడం నిమిషాల్లో పూర్తి అవుతుంది. ఈ పోర్టబుల్ గాడ్జెట్‌తో సాధారణ కత్తి కంటే తక్కువ సమయంలో కూరగాయలను కట్ చేయవచ్చు. దీని అసలు ధర రూ. 999 అయితే మీరు అమెజాన్ నుండి 67 శాతం తగ్గింపుతో రూ. 329కి కొనుగోలు చేయవచ్చు .
మినీ సీలింగ్ మెషిన్..
చాలాసార్లు చిప్స్, నామ్‌కీన్, బిస్కెట్లు వంటి వాటిని ప్యాకెట్ సీల్ ని తీసేసి అలాగే పెట్టేస్తారు. దీంతో ఆహారం రుచి మారుతుంది. కానీ మినీ సీలింగ్ మెషిన్ తో మీరు మీ ప్యాకెట్‌ను మళ్లీ సీల్ చేయవచ్చు. మీరు ప్రయాణం చేసేటప్పుడు కూడా ఈ యంత్రాన్ని తీసుకెళ్లవచ్చు. మీరు అమెజాన్ నుండి కేవలం 298 రూపాయలకు దీన్ని కొనుగోలు చేయవచ్చు.
4 ఇన్ 1 ఎలక్ట్రిక్ హ్యాండ్ హెల్డ్..
మీరు మల్టీ ఫంక్షన్ వెజిటేబుల్, ఫ్రూట్ కట్టర్ ను చాలా తక్కువ ధరకు సొంతం చేసుకోవచ్చు. అయితే దీని అసలు ధర రూ. 999, కానీ మీరు అమెజాన్ నుండి 35 శాతం తగ్గింపుతో కేవలం రూ. 650కి పొందొచ్చు.