Boat Wave Ultima smartwatch: specifications, price ?

ఈ స్మార్ట్ వాచ్ ల ప్రత్యేకత ఏమిటంటే కొనుగోలుదారులకు అందుబాటులో ఉంటుంది.ప్రస్తుతం 'వేవ్ అల్టిమా' పేరుతో మరో కొత్త స్మార్ట్‌వాచ్‌ను భారత్‌లో లాంచ్ చేసింది.

Update: 2022-11-10 03:58 GMT

దిశ, వెబ్ డెస్క్ : ప్రస్తుతం బోట్ కంపెనీ కొత్త కొత్త ప్రొడక్ట్స్ ను ఎప్పటికప్పుడు విడుదల చేస్తూ మొదటి స్థానానికి చేరుకోవాలనే లక్ష్యంగా దూసుకువెళ్తుంది. బోట్ సంస్థ నుంచి ఎన్నో స్మార్ట్‌వాచ్‌లను మన దేశంలో విడుదల చేసింది.ఈ స్మార్ట్ వాచ్ ల ప్రత్యేకత ఏమిటంటే కొనుగోలుదారులకు అందుబాటులో ఉంటుంది.ప్రస్తుతం 'వేవ్ అల్టిమా' పేరుతో మరో కొత్త స్మార్ట్‌వాచ్‌ను భారత్‌లో లాంచ్ చేసింది.

బోట్ వేవ్ అల్టిమా స్మార్ట్‌ వాచ్ బరువు 45 గ్రాములు ఉంటుంది.1.8-అంగుళాల Display తో మన ముందుకు వస్తుంది. వేవ్ అల్టిమా స్మార్ట్‌వాచ్‌లో Bluetooth v5.3 చిప్‌సెట్‌ అమరి ఉంటుంది.ఈ స్మార్ట్ వాచ్ కు ఒకసారి ఛార్జింగ్ పెడితే 15 రోజుల వరకు ఉంటుంది. మైక్రోఫోన్‌తో పాటు ఇన్‌బిల్ట్ HD స్పీకర్‌తో, బ్లూటూత్ కాలింగ్‌ ఫెసిలిటీ కూడా ఈ స్మార్ట్ వాచ్ లో ఉంటుంది.

భారత్ లో బోట్ wave అల్టిమా స్మార్ట్‌వాచ్ ధర రూ.2,999గా ఉంది.ఈ స్మార్ట్ వాచ్ మొత్తం 3 కలర్స్ మనకి అందుబాటులో ఉండనుంది. గ్రీన్, రెడ్, బ్లాక్ కలర్స్ లో మన ముందుకు రానుంది. బోట్ అధికారిక వెబ్‌సైట్లో కానీ ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఆన్లైన్ ఈ స్మార్ట్ వాచ్ ను కొనుగోలు చేయవచ్చు


Similar News