Cash payments: మీ వాటర్ బిల్లు ఇలా పే చేస్తున్నారా? డిజిటల్ లావాదేవీలతో కడితే ఎన్ని బెనిఫిట్సో తెలుసా?

సాధారణంగా చాలా మంది ఇంటి వాటర్ బిల్()Water Bill క్యాష్ పేమెంట్స్ ద్వారా చెల్లిస్తారు.

Update: 2024-10-26 07:24 GMT
Cash payments: మీ వాటర్ బిల్లు ఇలా పే చేస్తున్నారా? డిజిటల్ లావాదేవీలతో కడితే ఎన్ని బెనిఫిట్సో తెలుసా?
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: సాధారణంగా చాలా మంది ఇంటి వాటర్ బిల్()Water Bill క్యాష్ పేమెంట్స్ ద్వారా చెల్లిస్తారు. ప్రస్తుతం డిజిటల్ లావాదేవీలు(Digital transactions)పెరగడంలో ఆన్‌లైన్ ప్లాట్ ఫారమ్‌(Online platform)ల ద్వారా వాటర్ బిల్లులు చెల్లిస్తున్నారు. గతంలో కంటే ఇది మరింత సౌకర్యంగా అండ్ సురక్షితంగా ఉంటుంది. కాగా మీరు వాటర్ బిల్లును ఇప్పటికీ నగదుతో చెల్లించినట్లైతే.. వెంటనే ఆపేయండి. డిజిటల్ పేమెంట్స్ ద్వారా చెల్లించండి. ఎందుకంటే దీనిద్వారా బోలెడన్నీ లాభాలున్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

డిజిటల్ పేమెంట్స్ చేస్తే మీ సమయాన్ని ఆదా చేసుకోవచ్చు. అలాగే అవాంతారాలను నివారించాలన్నా. ఎక్స్ట్రా పెర్క్‌(Extra perk)లను ఆస్వాదించాలన్నా డిజిటల్ పేమెంట్స్ బెటర్. వాటర్ బిల్లులను చెల్లించాలంటే స్వయంగా మీరు వెళ్లి పే చేయాల్సి ఉంటుంది. లైన్‌లో వేచి ఉండి బిల్లు చెల్లించాల్సి ఉంటుంది. పే చేయడానికి మాన్యువల్‌గా ప్రాసెస్(Process manually) చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఇల్లు దూరం ఉన్నట్లైతే సమయం వృథా అవుతుంది. మీరు బిజీ షెడ్యూల్‌ను బ్యాలెన్స్ చేస్తున్నట్లయితే ఇది చాలా సమయం తీసుకుంటుంది.

డిజిటల్ లావాదేవీలు అయితే అయితే ప్రయాణంలో ఉన్నప్పుడు కూడా వాటర్ బిల్ కట్టుకోవచ్చు. బజాజ్ పే వంటి మొబైల్ యాప్‌(Mobile app)లతో బిల్‌ను పే చేసుకోవచ్చు. నిమిషాల్లో పే చేయవచ్చు. ఈ లావాదేవీ తక్షణమే ప్రాసెస్ అవుతుంది. ఒకవేళ నగదును తీసుకెళ్లేటప్పుడు డబ్బు దొంగతనం జరిగే అవకాశాలు ఉంటాయి. డిజిటల్ లావాదేవీలు మీ నిధులు, వ్యక్తిగత సమాచారాన్ని రక్షించడానికి మెరుగైన భద్రతా చర్యలను అందిస్తాయి.

Tags:    

Similar News