రాత్రిపూట iPhone నుంచి కాలుతున్న వాసన.. టెన్షన్లో యూజర్లు

ఇటీవల ఎంతో అట్టహాసంగా విడుదలైన iPhone 15 సరీస్‌లో పలు సమస్యలు బయటపడుతున్నాయి.

Update: 2023-11-08 13:12 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల ఎంతో అట్టహాసంగా విడుదలైన iPhone 15 సరీస్‌లో పలు సమస్యలు బయటపడుతున్నాయి. ఈ మధ్య కాలంలో ఫోన్ వేడెక్కుతున్నట్లు పలువురు యూజర్లు పేర్కొనగా, ఈ సమస్యకు పరిష్కారంగా కంపెనీ iOS 17.0.3 అప్‌డేట్‌ వెర్షన్‌ను విడుదల చేసింది. ఇది ఫోన్ హీట్ కావడంతో పాటు పలు రకాల సమస్యలను పరిష్కరించింది. అయితే ఇదే సమస్యతో మళ్లీ ఒక యూజర్ తన ఆందోళనను లేవనెత్తాడు.

రాత్రిపూట ప్లాస్టిక్ కాలుతున్న వాసన రావడంతో మేల్కొనగా తన iPhone 15 Pro నుంచే ఇది వస్తున్నట్లు గుర్తించాడు. పైగా దానికి స్క్రీన్ ప్రొటెక్టర్ కూడా లేదని అయినా కూడా ఫోన్ నుంచి వాసన వచ్చిందని, ఫోన్‌ను చూస్తే ఏదో తేడాగా అనిపించడంతో ఉదయం దగ్గరలోని యాపిల్ స్టోర్‌కు తీసుకెళ్ళగా, అక్కడి సిబ్బంది సైతం ఫోన్‌ను చూసి ఆశ్చర్యపడి వెంటనే ఉచితంగా స్క్రీన్‌‌ను మార్చి ఇచ్చారని యూజర్ పేర్కొన్నాడు.

Tags:    

Similar News