TikTok కు మరో దెబ్బ..

చైనా యాజమాన్యంలోని వీడియో-షేరింగ్ ప్లాట్‌ఫామ్ TikTokకు మరో దెబ్బ

Update: 2023-03-19 02:42 GMT

దిశ, వెబ్‌డెస్క్: చైనా యాజమాన్యంలోని వీడియో-షేరింగ్ ప్లాట్‌ఫామ్ TikTokకు మరో దెబ్బ. ఇప్పటికే కొన్ని దేశాల్లో నిషేధాన్ని ఎదుర్కొంటున్న యాప్, ఇప్పుడు తాజాగా, న్యూజిలాండ్ ప్రభుత్వం భద్రత కారణాల రీత్యా దీనిని నిషేధించింది. అయితే ఇది పార్లమెంటరీ సభ్యులకు చెందిన అధికారిక ఫోన్‌లకు మాత్రమే వర్తిస్తుంది. ప్రభుత్వానికి చెందిన అంశాలను దుర్వినియోగం చేయకుండా ఉండడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు అక్కడి అధికారులు తెలిపారు. ఇప్పటికే భారత్, అమెరికా, కెనడా, ఈయూలు TikTok ని నిషేధించిన జాబితాలో ఉన్నాయి. ఇటీవల రాజకీయ నాయకులు, సీనియర్ అధికారులు, ప్రజలకు చెందిన సున్నితమైన డేటాను ఈ యాప్ చైనా ప్రభుత్వంతో పంచుకోవచ్చనే కారణాలతో బ్రిటన్ ప్రభుత్వం కూడా ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌లు, స్మార్ట్ ఫోన్ లలో టిక్‌టాక్ వినియోగంపై నిషేధం విధించింది.

ఇవి కూడా చదవండి : ‘వింతనిపించినా.. వీడియో గేమ్ ఆడగలదు’

Tags:    

Similar News