Meta Threads : ట్విట్టర్‌కు పోటీగా మెటా థ్రెడ్స్ యాప్ లాంచ్..!
ఎలాన్ మస్క్ ఆధ్వర్యంలోని ట్విట్టర్‌కు పోటీగా మార్క్ జూకర్ బర్గ్ మెటా థ్రెడ్స్ యాప్‌ను తీసుకొస్తున్నట్లు ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే
దిశ, వెబ్‌డెస్క్: ఎలాన్ మస్క్ ఆధ్వర్యంలోని ట్విట్టర్‌కు పోటీగా మార్క్ జూకర్ బర్గ్ మెటా థ్రెడ్స్ యాప్‌ను తీసుకొస్తున్నట్లు ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తాజా సమాచారం ప్రకారం, ఈ యాప్ గురువారం(జులై 6) నుంచి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి యాపిల్ యాప్ స్టోర్‌లో ‘థ్రెడ్స్’ పేరుతో ఒక యాప్ కనిపించింది.
ఈ యాప్ ఇన్‌స్టాగ్రామ్ ఆధారంగా పనిచేస్తుంది. ట్విట్టర్ మాదిరిగా పోస్ట్ చేయవచ్చు. అలాగే, లైక్స్, కామెంట్స్, షేరింగ్ లాంటి ఆప్షన్స్ కూడా ఉండనున్నాయి. ఇంతకుముందు ఈ యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్‌లో కూడా గుర్తించినట్లు పలు నివేదికలు పేర్కొన్నాయి. ఎలాన్ మస్క్ ట్విట్టర్‌ను కొనుగోలు చేసిన తరువాత అతను తీసుకునే నిర్ణయాల కారణంగా చాలా మంది యూజర్లు అసంతృప్తిగా ఉన్నారు.
ఇటీవల ట్విట్టర్‌లో ట్విట్‌లను చూడటంలో కూడా పరిమితి విధించడంతో యూజర్లు మరింత ఆందోళనకు లోనవుతున్నారు. ఇలాంటి సమయంలో జూకర్ బర్గ్ థ్రెడ్స్ యాప్‌ను తీసుకొస్తున్నట్లు ప్రకటించడం విశేషం. ఈ యాప్ గనక సక్సెస్ అయితే మాత్రం ట్విట్టర్ విషయంలో ఎలాన్ మస్క్ భారీ నష్టాన్ని చూసే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి.
Read More..