MRI మెషిన్‌లోకి లోడ్ చేసిన తుపాకీతో వెళ్ళిన వ్యక్తి... ఏం జరిగిందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

ఒకప్పటి కాలంలో ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ చూసుకున్నా చాలా తక్కువ వైద్య యంత్రాలు ఉండేవి.

Update: 2024-02-15 08:41 GMT

దిశ, ఫీచర్స్ : ఒకప్పటి కాలంలో ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ చూసుకున్నా చాలా తక్కువ వైద్య యంత్రాలు ఉండేవి. అలాంటి సమయంలో ప్రజల వ్యాధులు బయటపడక సరైన వైద్యం అందక చనిపోయేవారు. కానీ పెరుగుతున్న టెక్నాలజీతో ప్రతి ఒక ఆరోగ్య సమస్యను తేల్చి చెప్పేందుకు యంత్రాలు వచ్చాయి. వాటి సహాయంతో డాక్టర్లు నిమిషాల్లో వ్యాధులను గుర్తించి చికిత్సను ప్రారంభిస్తున్నారు. అలాంటి యంత్రాల్లో ఒక యంత్రమే MRI. ఈ యంత్రం శరీరంలో ఉన్న ప్రతి ఒక్క రోగాన్ని బయటపెట్టడంలో ఉపయోగకరంగా ఉండడమే కాదు, చాలా ప్రమాదకరమైనది కూడా. ఒక్కో సమయంలో ఇది ప్రాణాలను కూడా తీయగలదు. ఇలాంటి ఒక భయానక సంఘటనే బ్రెజిల్‌లో జరిగింది. అసలు ఏం జరిగింది, సంఘటన ఏంటి దాని గురించిన వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం..

MRI స్కాన్ తీసే సమయంలో ఈ యంత్రం లోపల మెటల్ సంబంధిత వస్తువులను తీసుకెళ్లడం నిషేధించారు. గడియారాల నుంచి నగలు మొదలైనవన్నీ బయట తీసేసి తర్వాత లోపలికి వెళతారు. మెటల్ వస్తువులను తీసుకెళ్లినప్పుడు అది ప్రమాదకరం అని నిపుణులు చెబుతున్నారు. అయినా కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారు. 40 ఏళ్ల బ్రెజిలియన్ లాయర్ లియాండ్రో మథియాస్ డి నోవ్స్ కూడా ఇలాంటి నిర్లక్ష్యానికి పాల్పడ్డాడు. అతను లోడ్ చేసిన తుపాకీతో యంత్రం లోపలికి వెళ్ళాడు. LadBible నివేదిక ప్రకారం MRI యంత్రం అయస్కాంత శక్తి కారణంగా, లియాండ్రో తుపాకీ అతని నడుము నుండి వేరు అయి బుల్లెట్ నేరుగా అతని కడుపులోకి వెళ్లి ఆ వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన ఫిబ్రవరి 6వ తేదీన జరిగింది.

ముందస్తుగా వార్నింగ్..

మియామీ హెరాల్డ్ ప్రకారం పరీక్ష గదిలోకి ప్రవేశించే ముందు రోగికి వారితో పాటు ఉన్న తల్లికి సరైన సూచనలు ఇచ్చారు. లోహంతో చేసిన వస్తువులు ఏమైనా ఉంటే తీసేయాలని తెలిపారు. అయినా లియాండ్రో తుపాకీతో మెషీన్ లోపలికి ఎందుకు వెళ్లారు. దీంతో అతని ప్రాణాలు కోల్పోయాడు.

ఇలాంటి ఘటనలు గతంలో కూడా జరిగాయి..

MRI మెషీన్‌లో తుపాకీని తీసుకెళ్లడం వల్ల ప్రాణాలు కోల్పోయిన సంఘటన మొదటిది కాదు. గత ఏడాది డిసెంబర్‌లో అమెరికాలో ఒక మహిళ కూడా ఇలాగే ప్రాణాల మీదికి తెచ్చుకుంది. ఆమె కూడా లోడ్ చేసిన తుపాకీతో యంత్రం లోపలికి వెళ్లింది. యంత్రాన్ని ప్రారంభించిన వెంటనే ఆమె తుపాకి రియాక్ట్ అయి తుంటికి నేరుగా బుల్లెట్ తగిలింది. ఈ హృదయ విదారక ఘటనలో ఆమె ప్రాణాలు దక్కినప్పటికీ బ్రెజిలియన్ వ్యక్తి కడుపులో బుల్లెట్ వెళ్లడంతో ప్రాణాలను కాపాడుకోలేకపోయారు.


Similar News