కొండ పై మెటల్ స్తంభం.. గ్రహాంతరవాసుల పనే అంటున్న స్థానికులు..
కొన్ని కొన్ని విచిత్రమైన సంఘటనలు జరిగినప్పుడు ఆ ప్రాంత ప్రజలు ఆశ్చర్యానికి గురవుతూ ఉంటారు.
దిశ, ఫీచర్స్ : కొన్ని కొన్ని విచిత్రమైన సంఘటనలు జరిగినప్పుడు ఆ ప్రాంత ప్రజలు ఆశ్చర్యానికి గురవుతూ ఉంటారు. అసలు ఈ సంఘటన ఎలా జరిగింది అని ఆలోచిస్తూ తలలు బద్దలు కొట్టుకుంటూ ఉంటారు. అలాంటి ఒక సంఘటనే ఇప్పుడు వెలుగు చూసింది. బ్రిటన్‌లోని వేల్స్‌లోని ఓ కొండ పై ఓ వింత కనిపించడంతో జనం తలలు పట్టుకుంటున్నారు. అది ఏంటంటే ఉక్కుతో చేసిన త్రిభుజాకార నిర్మాణం. దీనిని ఆంగ్లంలో మోనోలిత్ అంటారు. గత కొన్ని సంవత్సరాలుగా, ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో ఇటువంటి ఏకశిలలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు వేల్స్‌లో కనుగొన్న ఈ స్థంబాన్ని చూసి ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అంతే కాదు ఇది కచ్చితంగా గ్రహాంతరవాసుల పనే కావచ్చు అనుకుంటున్నారు. వేల్స్ ఆన్‌లైన్ ప్రకారం ఈ ఏకశిలాలు కొన్ని రోజులు కనిపించిన తర్వాత అకస్మాత్తుగా అదృశ్యమవుతున్నాయట. దీంతో ఈ స్తంభాల ఆవిష్కరణ పై చర్చలు మొదలయ్యాయి.
ఎవరు మొదట చూశారు ?
వేల్స్ నివాసి రిచర్డ్ హేన్స్ దీనిని మొదటగా చూశారట. దీన్ని చూసిన ఆ వ్యక్తి ఈ నిర్మాణం శాస్త్రీయ పరిశోధనకు సంబంధించినది కావచ్చని అతను భావించాడట.
ఏకశిలా 10 అడుగుల ఎత్తు ఉండేది.
రిచర్డ్ వారు హే బ్లఫ్ వైపు వెళ్తున్నారని వారి కళ్ళు కుడి వైపున ఉన్న 10 అడుగుల పొడవు మెరిసే త్రిభుజాకార స్తంభం పై పడ్డాయని చెప్పారు. ఇది సైంటిఫిక్ మీడియా రీసెర్చ్‌కి సంబంధించినది కావచ్చు అని అతను అనుకున్నాడట. కానీ దగ్గరికి వెళ్లి చూసేందుకు ప్రయత్నించినప్పుడు అది చాలా వింతగా, పొడవుగా ఉందని అతను తెలిపారు. ఏకశిలను చూడటం ఇదే తొలిసారి అని ఆయన తెలిపారు.
ఇంతకు ముందు ఎక్కడ కనిపించింది ?
2020 సంవత్సరంలో UK, అమెరికాలో ఇటువంటి అనేక ఏకశిలాలు కనిపించాయని పలు నివేదికలు తెలిపాయి. ఇది మొదట అమెరికాలోని ఉటాలో కనిపించిందట. దీని తరువాత రొమేనియా, ఫ్రాన్స్, పోలాండ్, UK, కొలంబియాలో కనిపించినట్లు పలు నివేదికలు తెలిపాయి.