గూగుల్ లో సరికొత్త టెక్నాలజీ.. అందుబాటులో టెక్స్ట్ టు వీడియో జనరేట్ ఆప్షన్..

గూగుల్ ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్స్ ని అందుబాటులోకి తీసుకు వస్తుంది.

Update: 2024-01-27 09:04 GMT

దిశ, ఫీచర్స్ : గూగుల్ ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్స్ ని అందుబాటులోకి తీసుకు వస్తుంది. ఈ క్రమంలోనే ఇటీవల కొత్త టెక్నాలజీని అందుబాటులోకి తీసుకువచ్చింది. దీని సహాయంతో మీరు టెక్స్ట్ రాస్తే చాలు వీడియోలను సృష్టిస్తుంది. ఈ టెక్నాలజీ పేరు LUMIERE. ఈ LUMIERE అనేది టెక్స్ట్-టు-వీడియో జనరేషన్ మోడల్. ఈ టెక్నాలజీని ఉపయోగించి మీరు ఏదైనా కంటెంట్ ని ఎంటర్ చేస్తే దానికి సంబంధించిన వీడియో క్రియేట్ అవుతుంది. అలాగే ఏదైనా ఇమేజ్ ని ఎంటర్ చేసినా వీడియో క్రియేట్ చేయగలుగుతుంది. దీని ద్వారా మీరు మోషన్ వీడియోలని కూడా సృష్టించవచ్చు. ఈ సాధనం ఎలా పనిచేస్తుందో తెలిపే వీడియో Xలో షేర్ చేశారు.

LUMIERE స్పేస్-టైమ్ U-నెట్ ఆర్కిటెక్చర్‌ తో పనిచేస్తుంది. ఇందులో టెక్స్ట్ ఎంటర్ చేసి వీడియోను రూపొందిస్తుంది. LUMIERE ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉంది. అయినా Google AI ప్లాట్‌ఫారమ్‌ నుంచి దీన్ని యాక్సెస్ చేసి ఉపయోగించవచ్చు. ఈ ప్లాట్‌ఫారమ్‌కి వెళ్లిన తర్వాత, మీరు LUMIERE ట్యాబ్‌కు వెళ్లాలి. ఆ తరువాత మీరు కొత్త వీడియోని సృష్టించడానికి క్రియేట్ బటన్‌ను క్లిక్ చేయవచ్చు.

కొత్త వీడియోని సృష్టించడానికి వీడియో క్రియేట్ ఆప్షన్ ని క్లిక్ చేసి తర్వాత టెక్ట్స్ ను ఎంటర్ చేయాలి. తర్వాత క్రియేట్ ఆప్షన్ ను ఎంచుకోవాలి. అలా చేసిన వెంటనే మీకు స్క్రీన్ పై వీడియో వచ్చేస్తుంది. ఈ టెక్నాలజీతో ఎన్నో అద్భుతమైన వీడియోలను మనకు నచ్చిన విధంగా క్రియేట్ చేసుకోవచ్చు.

Tags:    

Similar News