జియో మరో సంచలనం.. తక్కువ ధరకే ల్యాప్‌టాప్
దేశీయ దిగ్గజ సంస్థ రిలయన్స్ జియో నుంచి కొత్తగా రెండవ తరం ల్యాప్‌టాప్ భారత మార్కెట్లోకి రాబోతుంది.
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజ సంస్థ రిలయన్స్ జియో నుంచి కొత్తగా రెండవ తరం ల్యాప్‌టాప్ భారత మార్కెట్లోకి రాబోతుంది. దీనికి సంబంధించిన డిజైన్‌ను అమెజాన్ మైక్రోసైట్ ఇటీవల విడుదల చేసింది. JioBook (2023) అనే ల్యాప్‌టాప్ తక్కువ ధరలో వినియోగదారులకు లభిస్తుంది. ఈ ల్యాప్‌టాప్ నుంచి వచ్చిన ముందస్తు నివేదికల ప్రకారం, ఇది 4G కనెక్టివిటీకి సపోర్ట్‌తో వస్తుంది. దీని బ్యాటరీ బ్యాకప్ ఎక్కువ కాలం ఉంటుంది. ఒక రోజంతా వాడిన కూడా చార్జింగ్ అయిపోదని నివేదిక తెలిపింది.
అంచనాల పరంగా దీని ధర రూ.20,000 లోపు ఉంటుంది. దీని బరువు కూడా తక్కువగా 990g బరువుతో వస్తుంది. ఎక్కడికైనా తీసుకెళ్లడానికి తేలికగా ఉంటుంది. Jio Book ఆండ్రాయిడ్ ఫోర్క్డ్ వెర్షన్ అయిన JioOS ద్వారా Android యాప్‌లు, గేమ్‌లను రన్ చేయగలదు. ప్రధానంగా విద్యార్థుల కోసం, Wi-Fi నెట్‌వర్క్ మద్దతుతో హై-స్పీడ్ కనెక్టివిటీని అందిస్తుంది.
గత సంవత్సరం భారతదేశంలో ప్రారంభించిన Jio Book, మొదటి తరం ధర రూ. 15,799. ఇది 11.6-అంగుళాల HD (1366 x 768 పిక్సెల్స్) డిస్ప్లేను కలిగి ఉంది. 5,000mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది, దీన్ని ఒక్కసారి చార్జ్ చేస్తే 8 గంటల కంటే ఎక్కువ బ్యాటరీ లైఫ్‌ను ఆఫర్ చేస్తుందని కంపెనీ పేర్కొంది. అయితే ఇప్పుడు తీసుకురాబోయే ల్యాప్‌టాప్ మరింత మన్నికైన బ్యాటరీతో వస్తుంది.