భారీ డిస్‌ప్లేతో టెక్నో మొట్టమొదటి ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్

చైనీస్ స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ టెక్నో మొట్టమొదటి ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ ఫాంటమ్ V ఫోల్డ్‌ను బార్సిలోనాలో జరిగిన మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2023 ఈవెంట్‌లో ఆవిష్కరించింది.

Update: 2023-03-01 11:30 GMT

దిశ, వెబ్‌డెస్క్: చైనీస్ స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ టెక్నో మొట్టమొదటి ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ ఫాంటమ్ V ఫోల్డ్‌ను బార్సిలోనాలో జరిగిన మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2023 ఈవెంట్‌లో ఆవిష్కరించింది. ఈ ఫోన్ ప్రపంచంలోనే మొదటి ఎడమ-కుడి ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ అని కంపెనీ పేర్కొంది. త్వరలో భారత్‌లో లాంచ్ కానుంది. 12GB RAM+512GB వేరియంట్ రూ. 79,999. 12GB RAM+256GB వేరియంట్ ధర రూ. 89,999. కొనుగోలు సమయంలో అసలు ధరపై తగ్గదల ఉంటుంది.


ఫాంటమ్ V ఫోల్డ్‌ స్పెసిఫికేషన్స్

ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ 6.42-అంగుళాల LTPO AMOLED కవర్ డిస్‌ప్లేతో వస్తుంది. ఫోన్‌ను ఓపెన్ చేసినప్పుడు ప్రధాన డిస్‌ప్లే 7.85-అంగుళాల (2000x2296) రిజల్యూషన్ కలిగి ఉంటుంది. ఇది 4nm MediaTek డైమెన్సిటీ 9000+ SoC ద్వారా పనిచేస్తుంది. ఫోన్ వెనక భాగంలో 50MP ప్రధాన కెమెరా, 50MP 2x జూమ్ కెమెరా, 13MP అల్ట్రావైడ్ కెమెరా, రెండు సెల్ఫీ కెమెరాలు 32MP, 16MP కెమెరాలు ఉన్నాయి. 45W వైర్డ్ చార్జింగ్‌తో 5,000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఫోన్ 15 నిమిషాల్లో 40 శాతం, 55 నిమిషాల్లో పూర్తిగా చార్జ్ అవుతందని కంపెనీ పేర్కొంది. Tecno ఫాంటమ్ V ఫోల్డ్ బ్లా్క్, వైట్ అనే రెండు కలర్ వేరియంట్‌లలో లభిస్తుంది.

Tags:    

Similar News