Smart Tv: స్మార్ట్ టీవీ క్లీన్ చేసే సమయంలో ఈ తప్పులను చేయకండి?

టెక్నాలజీ మారుతున్న కొద్దీ కొత్త కొత్త స్మార్ట్ టీవీలు మన ముందుకు వస్తున్నాయి.

Update: 2023-03-20 07:49 GMT

దిశ, వెబ్ డెస్క్: టెక్నాలజీ మారుతున్న కొద్దీ కొత్త కొత్త స్మార్ట్ టీవీలు మన ముందుకు వస్తున్నాయి. వీటిని అందరూ క్లీన్ చేస్తుంటారు. కొందరైతే ఎలా పడితే అలా క్లీన్ చేస్తారు. అలా చేస్తే స్క్రీన్ తొందరగా పాడయ్యే అవకాశం ఉంది. తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే డిస్‌ప్లే పై ప్రభావం చూపే అవకాశం ఉంది.

టవల్స్, టిష్యూలు వద్దు

స్మార్ట్ టీవీ స్క్రీన్స్ ని టవల్స్, టిష్యూలతో క్లీన్ చేయకూడదు. స్క్రీన్‌ తుడిచేందుకు మైక్రోఫైబర్ క్లాత్ వాడటం వలన స్క్రీన్‌కు ఏమి కాకుండా ఉంటుంది. టవల్‌తో క్లీన్ చేసేటప్పుడు గట్టిగా కాకుండా.. స్మూత్‌గా తుడవండి.

టీవీ ఆన్‌లో ఉన్నపుడు క్లీన్ చేయకండి

కొంతమంది తెలియని వారు టీవీ ఆన్‌ చేసి ఉన్నప్పుడే తొందర తొందరగా తడి క్లాత్ తీసుకోని క్లీన్ చేసి పనైపోయిందనుకుంటారు. ఇలా అస్సలు చేయకండి. కరెంటు షాక్ కొట్టే ప్రమాదముంది.

తొందర పడకండి

టీవీ స్క్రీన్‌ను తుడిచే సమయంలో పని తొందరగా ఐపోవాలని గజిబిజిగా చేయకండి. అలా చేస్తే స్క్రీన్ పై గీతలు పడతాయి. కాబట్టి చేసే పనిని నెమ్మదిగా చేయండి.

Also Read...

Xiaomi రికార్డును బ్రేక్ చేయనున్న ఐఫోన్ కొత్త మోడల్ 

Tags:    

Similar News