వాట్సాప్‌లో ఫొటోలు, వీడియోలను షేర్ చేయడానికి షార్ట్‌కట్ ఫీచర్
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తన వినియోగదారుల కోసం కొత్తగా ఒక ఫీచర్‌ను తీసుకురానున్నట్లు తెలిపింది.
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తన వినియోగదారుల కోసం కొత్తగా ఒక ఫీచర్‌ను తీసుకురానున్నట్లు తెలిపింది. చాట్ బాక్స్‌లో డైరెక్ట్‌గా ఫొటోలు, వీడియోలు షేర్ చేయడానికి సరికొత్త 'షార్ట్‌కట్' సదుపాయాన్ని అందించడానికి వాట్సాప్ ప్రయత్నాలు చేస్తుంది. WABetaInfo ప్రకారం.. ఇంతకుముందు వినియోగదారులు డ్రాగ్ అండ్ డ్రాప్, `ఫైల్` అనే ఇతర షేరింగ్ ఆప్షన్‌ని ఉపయోగించడం ద్వారా మాత్రమే మీడియాను షేర్ చేసేవారు, అయితే ఇది కేవలం ఫొటోలు, వీడియోలను డాక్యుమెంట్‌లుగా షేర్ చేయడానికి అనుమతించింది. కానీ కొత్త ఫీచర్ ద్వారా షార్ట్‌కట్‌లో తొందరగా ఫొటోలు, వీడియోలను మీడియా ఫైల్స్‌లా షేర్ చేయవచ్చు. ప్రస్తుతానికి ఈ ఫీచర్ Windows 2.2306.2.0 వినియోగదారులకు రిలీజ్ చేశారు. మిగతా యూజర్లకు త్వరలోనే అందుబాటులోకి రానుంది.