Samsung Galaxy Tab S9 Series : Samsung కొత్త ట్యాబ్‌లు

దక్షిణ కొరియా దిగ్గజం శామ్‌సంగ్ త్వరలో కొత్త ఉత్పత్తులను లాంచ్ చేయనుంది. ఈ ఈవెంట్‌ను జులైలో నిర్వహించనుంది.

Update: 2023-06-26 10:57 GMT
Samsung  Galaxy Tab S9 Series : Samsung కొత్త ట్యాబ్‌లు
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: దక్షిణ కొరియా దిగ్గజం శామ్‌సంగ్ త్వరలో కొత్త ఉత్పత్తులను లాంచ్ చేయనుంది. ఈ ఈవెంట్‌ను జులైలో నిర్వహించనుంది. దీనిలో కొత్త ఫీచర్లతో రాబోతున్న ప్రోడక్ట్స్‌లను ఆవిష్కరిస్తుంది. గెలాక్సీ వాచ్ 6 సిరీస్, స్మార్ట్‌ట్యాగ్ 2, స్మార్ట్ రింగ్, XR హెడ్‌సెట్‌ మొదలగు డివైజ్‌లు విడుదల కానున్నాయి. ముఖ్యంగా టిప్‌స్టర్ ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన దాని ప్రకారం, కంపెనీ Galaxy Tab S9 సిరీస్‌పై పని చేస్తోంది. ఇది Galaxy Tab S9, S9 FE, S9 FE+, S9+, S9 అల్ట్రా అనే ఐదు వేరియంట్‌లలో లాంచ్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది.

ఈ ట్యాబ్‌ అన్నింట్లో కూడా డైనమిక్ AMOLED 2X డిస్‌ప్లేను కలిగి ఉంటాయి. S9 మోడల్ 11-అంగుళాల స్క్రీన్‌, 12MP సెల్ఫీ కెమెరా, 13MP బ్యాక్ కెమెరా, 8,400mAh బ్యాటరీని కలిగి ఉంటుంది.

S9+ 12.4-అంగుళాల డిస్‌ప్లే, 12MP సెల్ఫీ కెమెరా, 13MP, 8MP బ్యాక్ కెమెరా, 10,900mAh బ్యాటరీతో వస్తుంది.

S9 Ultra 14.6-అంగుళాల డిస్‌ప్లే, 12MP సెల్ఫీ కెమెరా, 13MP, 8MP బ్యాక్ కెమెరా 11,200mAh బ్యాటరీని కలిగి ఉండే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది.

ఈ సిరీస్ ట్యాబ్‌లు అన్ని స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 చిప్‌సెట్‌ల ద్వారా శక్తిని పొందుతాయి. నీరు, ధూళి నిరోధకత కోసం IP68 రేటింగ్‌ చేయబడ్డాయి.

Read More..

యాపిల్ ఫోన్లు వాడుతున్న వారికి కేంద్రం తీవ్ర హెచ్చరిక! 

Tags:    

Similar News