Samsung A56: శాంసంగ్ నుంచి 280 ఎంపీ కెమెరాతో త్వరలో మరోకొత్త మొబైల్ లాంచ్.. పూర్తి వివరాలివే..!

దక్షిణ కొరియా(South Korea)కు చెందిన టెక్‌ దిగ్గజం, ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ తయారీ కంపెనీ శాంసంగ్(Samsung) నుంచి మరోకొత్త మొబైల్ త్వరలో గ్లోబల్ మార్కెట్లో(Global Market) లాంచ్ కాబోతుంది.

Update: 2024-11-07 17:03 GMT

దిశ, వెబ్ డెస్క్: దక్షిణ కొరియా(South Korea)కు చెందిన టెక్‌ దిగ్గజం, ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ తయారీ కంపెనీ (Samsung) నుంచి మరోకొత్త మొబైల్ త్వరలో గ్లోబల్ మార్కెట్లో(Global Market) లాంచ్ కాబోతుంది. శాంసంగ్ ఏ56(Samsung A56) పేరుతో దీన్ని ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 8 జీబీ ర్యామ్‌, 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌తో ఈ ఫోన్ ను తీసుకురానున్నారని తెలుస్తోంది. అయితే ఈ మొబైల్ ధరకు సంబంధించి కంపెనీ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. త్వరలోనే దీనికి సంబంధించి మరిన్ని విషయాలు తెలిసే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. తాజాగా ఈ ఫోన్ కు సంబంధించిన స్పెసిఫికేషన్స్(Specifications)ను సంస్థ ఆన్‌లైన్ లో రివీల్ చేసింది.

శాంసంగ్ ఏ56 ఫోన్ స్పెసిఫికేషన్ల వివరాలు..

  • 6.67 ఇంచెస్‌తో కూడిన డిస్‌ప్లేను ఇవ్వనున్నారని తెలుస్తోంది.
  • 8 జీబీ ర్యామ్+256 జీబీ రోమ్(8GB RAM+256GB ROM)
  • 1080 x 2340 రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్‌తో ఈ స్క్రీన్‌ను తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది.
  • ఇక బ్యాక్ సైడ్ 280 మెగాపిక్సెల్స్‌తో కూడిన ప్రైమరీ కెమెరాలను కలిగి ఉంది. 4కే రిజల్యూషన్‌తో కూడిన వీడియోలను చిత్రీకరించవచ్చు.
  • సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 62 మెగా పిక్సెల్ ఫ్రంట్‌ కెమెరాను ఇందులో అమర్చారు.
  • శాంసంగ్ ఏ56 ఏకంగా 7600mAh కెపాసిటీ గల బ్యాటరీని కలిగి ఉంటుందని తెలుస్తోంది. లాంగ్ లాస్టింగ్ ఛార్జింగ్‌తో ఈ ఫోన్‌ పనిచేస్తుందని చెబుతున్నారు.
Tags:    

Similar News