IPL ప్రేక్షకులకు గుడ్‌న్యూస్.. రియాల్టీలో మ్యాచ్‌లను చూసే చాన్స్
ప్రస్తుతం IPL 2023 సీజన్ జోరుగా సాగుతోంది. క్రికెట్ లవర్స్ టీవీలు, స్మార్ట్ ఫోన్, ల్యాప్‌టాప్‌లకు అతుక్కుపోయి మరి చూస్తున్నారు.
దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం IPL 2023 సీజన్ జోరుగా సాగుతోంది. క్రికెట్ లవర్స్ టీవీలు, స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లకు అతుక్కుపోయి మరి చూస్తున్నారు. కానీ లైవ్ మ్యాచ్‌లను చూడలేకపోతున్నామనే భావన చాలా మందిలో ఉంటుంది. అయితే రిలయన్స్ జియో దీనికోసం ప్రత్యేకంగా ఒక ఆప్షన్‌ను తెచ్చింది. మార్కెట్లోకి కొత్తగా ‘జియో డ్రైవ్ వీఆర్ హెడ్‌సెట్’ ను లాంచ్ చేసింది. దీని ద్వారా ప్రేక్షకులు ఐపీఎల్ మ్యాచ్‌లను వర్చువల్ రియాల్టీలో వీక్షించడానికి అవకాశం ఉంటుంది. లైవ్ మ్యాచ్ అనుభూతి పొందాలనుకునే వారికి ఈ జియో డ్రైవ్ వీఆర్ హెడ్‌సెట్ (Jio Dive VR Headset) బాగా ఉపయోగపడుతుందని కంపెనీ పేర్కొంది.
ఈ డివైజ్, జియో సినిమా యాప్ ద్వారా ఐపీఎల్ మ్యాచ్‌లను చూసే వారికి మాత్రమే ఉపయోగపడుతుంది. జియో డ్రైవ్ వీఆర్ హెడ్‌సెట్‌లో 100-అంగుళాల వర్చువల్ స్క్రీన్, 360డిగ్రీస్ వ్యూలో మ్యాచ్‌లు వీక్షించవచ్చు. ఇది ఆండ్రాయిడ్ ఐఓఎస్-15 వెర్షన్‌తోపాటు తర్వాత అందుబాటులోకి వచ్చిన ఓఎస్ వెర్షన్ స్మార్ట్ ఫోన్లలో పని చేస్తుంది. దీనిని కనెక్ట్ చేయడానికి ఫోన్ డిస్ ప్లే 47 -6.7 అంగుళాలు ఉండాలి. ఫోన్‌లో గైరోస్కోప్, యాక్సెలెరో మీటర్ కూడా తప్పనిసరిగా ఉండాలి. దీని ధర రూ. 1299. పేటీఎం వ్యాలెట్ ద్వారా రూ. 500 క్యాష్ బ్యాక్ లభిస్తుంది.
హెడ్‌సెట్‌ను ఉపయోగించే విధానం..
* జియో డైవ్ హెడ్‌సెట్ కొనుగోలు చేశాక, బాక్స్‌పై ఉన్న క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేసి జియో ఇమ్మర్స్ యాప్‌ను ఇన్‌స్టాల్ చేయాలి.
* తర్వాత అన్ని వివరాలు ఎంటర్ చేసి లాగిన్ కావాలి.
* ఖచ్చితంగా జియో నెట్‌వర్క్ కు మాత్రమే కనెక్ట్ అయి ఉండాలి.
* తరువాత జియో డైవ్ ఆప్షన్ ఎంపిక చేసుకుని ‘వాచ్ ఆన్ జియో డైవ్’ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి.
* ఆ తరువాత హెడ్‌సెట్ సపోర్ట్ క్లిప్, లెన్స్ సరిగ్గా సెట్ చేసుకుని తలకు పెట్టుకుని మ్యాచ్ చూడవచ్చు.