కల్తీ పాలను గుర్తిస్తున్న పేపర్.. 30 సెకన్స్‌లో రిజల్ట్
యూరియా, డిటర్జెంట్, సోప్, స్టార్చ్, హైడ్రోజన్ పెరాక్సైడ్, సోడియం- హైడ్రోజన్- కార్బోనేట్ వంటి కెమికల్స్ కల్తీ కారకాలు.
దిశ, ఫీచర్స్ : యూరియా, డిటర్జెంట్, సోప్, స్టార్చ్, హైడ్రోజన్ పెరాక్సైడ్, సోడియం- హైడ్రోజన్- కార్బోనేట్ వంటి కెమికల్స్ కల్తీ కారకాలు. కానీ ఆర్గానిక్ ఫార్మా-ఫ్రెష్ అని పిలవబడే పాలు, పండ్ల రసాలలో కూడా ఉన్నాయా? అనే అనుమానం వస్తే తెలుసుకోవడం చాలా కష్టం. కానీ ప్రస్తుతం ఐఐటీ మద్రాస్ డెవలప్ చేసిన ప్యాకెట్ సైజ్ పేపర్ టెస్ట్ కిట్‌తో ఎవరికి వారు తాము తినే ఆహార పదార్థాలు, తాగే జ్యూస్, పాలు కల్తీవా? మంచివా? అనేది జస్ట్ 30 సెకన్స్‌లోనే తెలుసుకోవచ్చు.
‘ఈ టెస్ట్ కిట్ పైభాగంలో లిక్విడ్ డ్రాప్స్ (పరీక్షించడానికి) ఫీడ్ చేయగల స్లాట్ ఉంటుంది. దిగువన అనేక స్లాట్‌లు ఉన్న పాలెట్ లాంటి నిర్మాణం ఉంటుంది. ప్రతీ ఒక్కటి రంగును మార్చగల, నిర్దిష్ట కెమికల్స్ ఉనికిని సూచించగల సామర్థ్యం కలిగి ఉంటుంది. ఎగువ, దిగువ పొరల మధ్య శాండ్‌విచ్ చేయబడి, శాంపిల్ డ్రాప్స్‌ను గ్రహించి, దిగువ పొరలలోని కెమికల్ షీట్‌లతో అది కాంటాక్ట్ అవడం మూలంగా రంగు మారుతుంది. దానిని బట్టి రిజల్ట్ తెలిసిపోతుంది. టెస్ట్ చేసేందుకు పాలు, జ్యూస్ ఇలా ఏవైనా ద్రవ పదార్థాల నుంచి కొన్ని మిల్లీ లీటర్ల శాంపిల్ తీసుకుని, టెస్ట్ కిట్‌పై సూచించిన బాక్సులో వేయగానే 30 సెకన్లలో రిజల్ట్ తెలిసిపోతుంది. ఇంట్లోనే ఉండి ఏ వ్యక్తి అయినా కల్తీని గుర్తించేందుకు ఈ కిట్ అత్యంత తక్కువ ఖర్చుతోనే అందిస్తామని తెలిపారు. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అప్రూవల్‌తో త్వరలోనే మార్కెట్‌లోకి రానుంది ఈ టెస్ట్ కిట్.