OnePlus నుంచి మొట్టమొదటి ఫ్లాగ్‌షిప్ టాబ్లెట్.. ధర పూర్తి వివరాలు ఇవే!
OnePlus కంపెనీ నుంచి మొట్టమొదటి ఫ్లాగ్‌షిప్ టాబ్లెట్ విడుదల అయింది
దిశ, వెబ్‌డెస్క్: OnePlus కంపెనీ నుంచి మొట్టమొదటి ఫ్లాగ్‌షిప్ టాబ్లెట్ విడుదల అయింది. ఇది MediaTek Dimensity 9000 చిప్‌సెట్ ఆధారంగా పనిచేస్తుంది. 8GB RAM + 128GB స్టోరేజ్ ధర రూ. 37,999. 12GB RAM + 256GB ధర రూ. 39,999. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, OnePlus స్టోర్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. కొనుగోలు టైంలో ICICI బ్యాంక్ క్రెడిట్/డెబిట్ కార్డ్, EMI లావాదేవీలపై రూ. 2000 తగ్గింపును పొందవచ్చు. ఏప్రిల్ 28, 2023 మధ్యాహ్నం 12 గంటల నుండి, ప్రీ-ఆర్డర్ చేయవచ్చు. మే 2, 2023 మధ్యాహ్నం 12 గంటలకు ఓపెన్ సేల్ ప్రారంభమవుతుంది.
వన్‌ప్లస్ టాబ్లెట్ 2.8K రిజల్యూషన్, 7:5 స్క్రీన్ నిష్పత్తితో భారీ 11.61-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 144Hz రిఫ్రెష్ రేట్, HDR10+, డాల్బీ విజన్, డాల్బీ అట్మోస్ సపోర్ట్‌ను కలిగి ఉంది. వినియోగదారులు ఎక్కువ సేపు వాడుకునేలా 67W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 9510mAh బ్యాటరీని కూడా అందించారు. దీని బాడీ మొత్తం మెటల్‌తో చేయబడింది. టాబ్లెట్ బ్యాక్‌సైడ్ 13MP కెమెరా, 8MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో వస్తుంది. ఇది OxygenOS 13.1 సాఫ్ట్‌వేర్‌తో రన్ అవుతుంది.