Nokia నుంచి సరికొత్త 5G స్మార్ట్ ఫోన్.. ఇవే ఫీచర్స్

హెచ్‌ఎండీ గ్లోబల్ నోకియా నుంచి కొత్త మోడల్ 'నోకియా ఎక్స్ 30 5జీ(Nokia X30 5G)' స్మార్ట్‌ఫోన్‌ను బుధవారం విడుదల చేస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది

Update: 2023-02-15 12:18 GMT
Nokia నుంచి సరికొత్త 5G స్మార్ట్ ఫోన్.. ఇవే ఫీచర్స్
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: హెచ్‌ఎండీ గ్లోబల్ నోకియా నుంచి కొత్త మోడల్ 'నోకియా ఎక్స్ 30 5జీ(Nokia X30 5G)' స్మార్ట్‌ఫోన్‌ను బుధవారం విడుదల చేస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. 8GB RAM+ 256GB స్టోరేజ్ ధర రూ. 48,999 గా ఉండనుంది. ఇది ఫిబ్రవరి 20 నుండి అమెజాన్, నోకియా వెబ్‌సైట్‌లలో ప్రత్యేకంగా అమ్మకానికి అందుబాటులో ఉంటుంది. ప్రీ-బుకింగ్‌ను ఇప్పటికే ప్రారంభించారు.


ఈ ఫోన్ 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.43 అంగుళాల AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రోటక్షన్‌ను అమర్చారు. ఇంకా ఫోన్ Qualcomm Snapdragon 695 ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. Android 12 ద్వారా పనిచేస్తుంది. ప్రైమరీ లెన్స్ 13MP అల్ట్రా-వైడ్ సెన్సార్ సహాయంతో OISతో 50MP కెమెరా ఉంది. సెల్ఫీల కోసం 16MP కెమెరాను అందించారు. 33W చార్జర్‌తో 4,200mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ ఫోన్ IP67 డస్ట్ ప్రొటెక్షన్‌తో వస్తుంది.





Tags:    

Similar News