Motorola: మోటోరోలా నుంచి కొత్త స్మార్ట్ ఫోన్.. నీటిలో పడిన ఈ ఫోనుకి ఏం కాదట
ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ కంపెనీలు మొబైల్ లవర్స్ కోసం కొత్త కొత్త ఫోనులను అందుబాటులోకి తెస్తుంది.
దిశ, ఫీచర్స్: ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ కంపెనీలు మొబైల్ లవర్స్ కోసం కొత్త కొత్త ఫోనులను అందుబాటులోకి తెస్తుంది. వారానికొక కొత్త స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి విడుదలవుతుంది. దీంతో ఏ ఫోన్ తీసుకోవాలా అని చాలా సందేహిస్తున్నారు. అలాంటి వారు ఈ 5జీ స్మార్ట్ ఫోన్ పై ఓ లుక్కేయండి. ప్రముఖ మొబైల్ కంపెనీ ‘మోటోరొలా ఎడ్జ్ 50’ అనే కొత్త ఫోన్ ని మన ముందుకు తీసుకురానుంది.
ఈ సీరీస్ మొబైల్ ఆగస్టు 1న మన దేశంలో లాంచ్ కాబోతుంది. ఇంత వరకు లేని విధంగా వాటర్ రెసిస్టెంట్ ఫీచర్, ఇంగ్రెస్ ప్రొటెక్షన్ 68 తో రాబోతుంది. అంటే ఫోన్ లోకి వాటర్ చేరకుండా కాపాడుతుంది. ఎంత వేడి వాతావరణాన్ని అయినా సరే ఇది తట్టుకుంటుంది. వేడి ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో కూడా ఇది పని చేస్తుంది. నీటిలో 30 నిమిషాల పాటు ఉన్నా కూడా.. ఫోన్ లోకి కొంచం కూడా నీరు వెళ్లవని కంపెనీ చెబుతోంది. ఈ సీరీస్ మూడు వేరియంట్లలో, మూడు కలర్ ఆప్షన్‌లలో లభించనుంది. దీని ధర రూ. 25 వేలకు పైగానే ఉంటుందని తెలుస్తోంది.
మోటోరోలా ఎడ్జ్ 50 స్పెసిఫికేషన్స్
32 ఎంపీ సెల్ఫీ కెమెరా,
1900 నిట్స్ హెచ్‌డీఆర్ పీక్ బ్రైట్‌నెస్,
సోనీ లిటియా 700సీ కెమెరా,
15 వాట్స్ వైర్‌లెస్ ఛార్జర్,
6.67 ఫోఎల్‌ఈడీ డిస్‌ప్లే,
5000 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీ.