AI ఫీచర్లతో కొత్త ఇయర్‌బడ్స్.. ధర, ఫీచర్లు చూస్తే అదుర్స్..
నథింగ్ ఇయర్ (ఎ) భారతదేశంలో లాంచ్ చేశారు. వినియోగదారులను ఆకట్టుకునే కొత్తడిజైన్ తో అందుబాటులో ఉన్నాయి.
దిశ, ఫీచర్స్ : నథింగ్ ఇయర్ (ఎ) భారతదేశంలో లాంచ్ చేశారు. వినియోగదారులను ఆకట్టుకునే కొత్తడిజైన్ తో అందుబాటులో ఉన్నాయి. అంతేకాదు ఈ ఇయర్‌బడ్స్ ChatGPAT AI ఫీచర్ కూడా అందుబాటులో ఉంది. పసుపు రంగులో ఉండే ఇయర్‌బడ్స్ అందరికీ ఆకర్షించే విధంగా కనిపించనున్నాయి.
ధర, ఆఫర్‌లు..
నథింగ్ ఇయర్ ధర రూ. 11,999. దీని విక్రయం ఏప్రిల్ 29న భారతదేశంలో ప్రారంభమవుతుంది. నథింగ్ ఇయర్ (ఎ) ధర రూ. 7,999. దీని విక్రయం 22 ఏప్రిల్ 2024 నుండి ప్రారంభమవుతుంది. ఫ్లిప్‌కార్ట్, క్రోమా, విజయ్ సేల్స్ ద్వారా ఇయర్‌బడ్స్ అందుబాటులో ఉంటాయి. నథింగ్ ఇయర్ (ఎ)ని రూ. 5,999కి కూడా కొనుగోలు చేయవచ్చు.
స్పెసిఫికేషన్లు..
ఇయర్‌బడ్స్‌లో స్పష్టమైన సౌండ్ అందుబాటులో ఉంది. ఇది డ్యూయల్ ఛాంబర్ డిజైన్‌ను కలిగి ఉంది. గాలి ప్రవాహానికి రెండు అదనపు వెంట్లు అందించారు. ఇయర్‌బడ్స్ LHDC 5.0, LDAC కోడెక్ సపోర్ట్‌తో వస్తాయి.
ఇది బ్లూటూత్ ద్వారా అధిక రిజల్యూషన్ స్ట్రీమింగ్ సౌకర్యాన్ని అందిస్తుంది. ఇయర్‌బడ్స్ ను నథింగ్ యాప్‌కి కనెక్ట్ చేయవచ్చు. ఇయర్‌బడ్స్‌లో గొప్ప ANC ఫీచర్ అందించారు. నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్ ఇందులో అందించారు. ఇది మూడు ఆటోమేటిక్ నాయిస్ క్యాన్సిలేషన్ స్థాయిలను హై, మీడియం, తక్కువ కలిగి ఉంది. ఇయర్‌బడ్స్‌లో 45 డీబీ నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్ ఉంది.
నథింగ్ ఇయర్ కస్టమ్ 11 mm డైనమిక్ డ్రైవర్‌ను కలిగి లేదు. ఇది బ్లూటూత్ ద్వారా హై-రిజల్యూషన్ స్ట్రీమింగ్ కోసం LHDC 5.0, LDAC కోడెక్‌లకు మద్దతు ఇస్తుంది. వాయిస్ ప్రొఫైల్‌ని సృష్టించడం, ఈక్వలైజర్, ANC నియంత్రణ, ఇతర ఫీచర్‌లు నథింగ్ ఇయర్‌లో అందించనున్నారు.