WhatsApp మరో కొత్త ఫీచర్.. చాటింగ్‌కు ఫోన్ నెంబర్ అవసరమే లేదు!
మెసేజింగ్ యాప్ వాట్సాప్ తన వినియోగదారుల కోసం కొత్తగా మరోక ఫీచర్‌ను తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తుంది
దిశ, వెబ్‌డెస్క్: మెసేజింగ్ యాప్ వాట్సాప్ తన వినియోగదారుల కోసం కొత్తగా మరోక ఫీచర్‌ను తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తుంది. యూజర్లు తమ ఖాతాలకు యూజర్ నేమ్‌లను పెట్టుకునే ఆప్షన్ అందించడానికి వాట్సాప్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కొత్త ఫీచర్ ద్వారా ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ మాదిరిగా తమకు ఇష్టమైన యూజర్ నేమ్‌తో అవతలి వారితో చాట్ చేయవచ్చు. దీంతో ఫోన్ నెంబర్ కూడా షేర్ చేయాల్సిన అవసరమే లేకుండా కేవలం యూజర్ నేమ్ ద్వారా కూడా నేరుగా చాట్ చేయవచ్చని తెలుస్తోంది. ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉన్న ఈ ఫీచర్ ను త్వరలోనే యూజర్లకు అందించాలని వాట్సాప్ భావిస్తోంది.