Netflix: 12 నెలలు ఉచితంగా నెట్‌ఫ్లిక్స్ చూడొచ్చు.. అది ఎలాగంటే ?

మనకి సెలవు దొరికితే చాలు టీవీలు ముందో లేక ఫోనుల్లో సినిమాలు చూస్తుంటాము.

Update: 2023-02-24 05:31 GMT

దిశ, వెబ్ డెస్క్ : మనకి సెలవు దొరికితే చాలు టీవీలు ముందో లేక ఫోనుల్లో సినిమాలు చూస్తుంటాము. వాటిలో నెట్‌ఫ్లిక్స్ అయితే మరి. రాత్రి పగలు అని తేడా లేకుండా 24 గంటలు అదే పనిగా అతుక్కుపోతుంటారు. యాక్ట్ పైబర్ తన కస్టమర్లకు మరింత దగ్గరవ్వడం కోసం కొత్తగా మూడు ప్లాన్స్‌ను మన ముందుకు తీసుకొచ్చింది. అవేంటో ఇక్కడ చూద్దాం.

1. రూ. 799 పెట్టి ఈ ప్లాన్‌ తీసుకుంటే.. 150 mbps స్పీడ్‌తో నెట్ పొందొచ్చు. ఈ ప్లాన్ 6 నెలలు లేదా 12 నెలలకు వేసుకుంటే నెట్‌ఫ్లిక్స్ ఫ్రీగా చూడొచ్చు.

2. ప్లాటినం ప్రోమో స్ట్రీమింగ్ ప్లాన్ రూ. 1049 ఉంటుంది. 250 mbps స్పీడ్‌‌తో వస్తుంది. ఈ ప్లాన్ 6 నెలలు లేదా 12 నెలలకు ఒకసారి వేసుకుంటే నెట్‌ఫ్లిక్స్ ఫ్రీగా చూడొచ్చు.

3. డైమండ్ స్ట్రీమింగ్ ప్లాన్ రూ. 1349 ఉంటుంది. 300 mbps ఉంటుంది. ఈ ప్లాన్ 6 నెలలు లేదా 12 నెలలకు ఒకసారి వేసుకుంటేనెట్‌ఫ్లిక్స్ ఫ్రీగా చూడొచ్చు.

Tags:    

Similar News