Xbox 360 ఆన్‌లైన్ స్టోర్‌ను మూసివేయనున్న Microsoft
మైక్రోసాఫ్ట్ తన ఆన్‌లైన్ స్టోర్ గేమింగ్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది.
దిశ, వెబ్‌డెస్క్: మైక్రోసాఫ్ట్ తన ఆన్‌లైన్ స్టోర్ గేమింగ్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. తన గేమింగ్ సబ్‌స్క్రిప్షన్ సర్వీస్ Xbox 360 ఆన్‌లైన్ స్టోర్ జులై 29, 2024న మూసివేయనున్నట్టు Xbox వెబ్‌సైట్‌లో పేర్కొంది. Xbox 360 అనే ఆన్‌లైన్ గేమింగ్ స్టోర్‌ను మైక్రోసాఫ్ట్ 2005లో ప్రారంభించింది. దీనిలో అన్ని రకాల గేమింగ్‌లను అందిస్తారు. వీటితో పాటు, పాత కన్సోల్‌లోని సినిమాలు, టీవీ యాప్ కూడా తీసివేయనున్నారు. వచ్చే ఏడాది నుంచి వీటి సబ్‌స్క్రిప్షన్ సర్వీస్‌లు యూజర్లకు అందుబాటులో ఉండవు.
కొత్త గేమ్స్‌ను డౌన్‌లోడ్ చేయడం కుదరదు. ఇప్పటికే కొనుగోలు చేసిన Xbox 360 గేమ్‌లు, కన్సోల్‌కు అనుకూలంగా పాత వెర్షన్‌లో ఆడుకోవచ్చు. మైక్రోసాఫ్ట్ 2014 వరకు సుమారు 84 మిలియన్ల Xbox 360 యూనిట్లను విక్రయించింది. ఒకప్పుడు మైక్రోసాఫ్ట్ Xbox 360 అనేది సోనీకి చెందిన ప్లేస్టేషన్ 3కి గట్టీ పోటీ ఇచ్చి అత్యధికంగా అమ్ముడైన గేమింగ్ కన్సోల్‌లలో ఒకటిగా నిలిచింది.