Jio Recharge Plan: యూజర్లకు అదిరిపోయే వార్త చెప్పిన జియో..365 రోజుల వ్యాలిడిటీతో బెస్ట్ రీచార్జ్ ప్లాన్

io Recharge Plan: దేశంలోని అతిపెద్ద టెలికాం సంస్థ అయిన రిలయన్స్ జియోతో(Jio Recharge Plan)పాటు ఇతర కంపెనీలకు ట్రాయ్ కాలింగ్, ఎస్ఎంఎస్ లతో కూడిన చౌక ప్లాన్ అందించాలని ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.

Update: 2025-01-27 05:29 GMT
Jio Recharge Plan: యూజర్లకు అదిరిపోయే వార్త చెప్పిన జియో..365 రోజుల వ్యాలిడిటీతో బెస్ట్ రీచార్జ్ ప్లాన్
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్: Jio Recharge Plan: దేశంలోని అతిపెద్ద టెలికాం సంస్థ అయిన రిలయన్స్ జియోతో(Jio Recharge Plan)పాటు ఇతర కంపెనీలకు ట్రాయ్ కాలింగ్, ఎస్ఎంఎస్ లతో కూడిన చౌక ప్లాన్ అందించాలని ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే జియో(jio) కాలింగ్, ఎస్ఎంఎస్ తో రెండు చౌక ప్లాన్స్ ను ప్రవేశపెట్టింది. జియో(jio) తన వెబ్ సైట్లో ఈ రెండు కొత్త వాయిస్ ఓన్లీ ప్లాన్స్ జాబితా చేసింది. దీనిలో యూజర్లు 365 రోజుల వరకు దీర్ఘకాలిక వ్యాలిడిటీ చెల్లుబాటు అవుతుంది.

కాగా డేటాను ఎక్కువగా ఉపయోగించేవారికి ఈ ప్లాన్ ఎంతో ప్రయోజనకంగా ఉంటుంది. జియో ఈ ప్లాన్(Jio Recharge Plan) ను కాలింగ్, ఎస్ఎంఎస్ కు మాత్రమే ఉపయోగించి..డేటా అవసరం లేని యూజర్ల కోసం పరిచయం చేసింది. జియో ఒకటి రూ. 458 ప్లాన్ లో 84 రోజుల వ్యాలిడిటీ తో వస్తుండగా...రూ. 1958 ప్లాన్ లో 365 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది. ఈ రెండు ప్లాన్లలో యూజర్లకు ఎన్నో బెనిఫిట్స్ ఉంటాయి.

84 రోజుల జియో ప్లాన్:

జియో కొత్త రూ. 458 ప్లాన్ 84 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. ఈ ప్లాన్‌లో, వినియోగదారులు అపరిమిత కాలింగ్, 1000 ఉచిత SMSలను పొందుతారు. ఇది కాకుండా, వినియోగదారులు జియో సినిమా(jio cinema), జియో టీవీ(jio tv) వంటి యాప్‌లకు కూడా ఫ్రీ యాక్సెస్ పొందుతారు. ఫ్రీ కాలింగ్, ఎస్ఎంఎస్( SMS)కు మాత్రమే ఉపయోగించే వినియోగదారుల కోసం ప్రత్యేకంగా ఈ ప్లాన్ తీసుకువచ్చింది. ఈ ప్లాన్‌లో, భారతదేశం అంతటా ఏ నెట్‌వర్క్‌లోనైనా అపరిమిత కాల్‌లు, ఉచిత జాతీయ రోమింగ్ సౌకర్యం అందిస్తుంది.

365 రోజుల జియో ప్లాన్:

జియో కొత్త రూ. 1958 ప్రీపెయిడ్ ప్లాన్ 365 రోజుల సుదీర్ఘ వాలిడిటీతో వస్తుంది. ఈ ప్లాన్‌లో, వినియోగదారులు భారతదేశంలోని ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమిత కాలింగ్ ప్రయోజనాన్ని పొందుతారు. అంతేకాకుండా, ఇందులో 3600 ఫ్రీ ఎస్ఎంఎస్, ఫ్రీగా నేషనల్ రోమింగ్ కాల్స్ కూడా ఉంటాయి. ఈ ప్లాన్ Jio సినిమా, Jio TV వంటి యాప్‌లకు ఉచిత యాక్సెస్‌ను కూడా అందిస్తుంది.

జియో రెండు ప్లాన్‌లను తొలగించింది:

కాగా జియో ఇప్పుడు పాత రీచార్జ్ ప్లాన్స్ ను జాబితా నుంచి తొలగించేసింది. రూ.479, రూ.1899.. రూ.1899 ప్లాన్ 336 రోజుల చెల్లుబాటుతో 24GB డేటాను అందిస్తుంది. రూ.479 ప్లాన్ 84 రోజుల చెల్లుబాటుతో 6జీబీ డేటాను కూడా ఈ ప్లాన్‌ అందించింది.

Tags:    

Similar News