Jio Exclusive Offer: ఇదిరా అంబానీ మావ గొప్పదనం.. ఐపీఎల్ లవర్స్ కోసం భలే ఆఫర్లు ఇచ్చేశాడుగా!
Jio Exclusive Offer: ఐపీఎల్ 18వ సీజన్ కు ముందు రిలయన్స్ జియో క్రేజీ ఆఫర్ ను ప్రకటించింది.

దిశ, వెబ్‌డెస్క్: Jio Exclusive Offer: ఐపీఎల్ 18వ సీజన్ కు ముందు రిలయన్స్ జియో క్రేజీ ఆఫర్ ను ప్రకటించింది. టీవీ లేదా ఫోన్ లో 90రోజుల ఫ్రీ జియో హాట్ స్టార్, క్రికెట్ మ్యాచ్ ల 4కే స్ట్రీమింగ్, జియో ఫైబర్ లేదా ఎయిర్ ఫైబర్ కు 50రోజుల ఫ్రీ కనెక్షన్ ను పొందవచ్చు. జియో సిమ్ కార్డు పాత, కొత్త కస్టమర్లకు ఈ కొత్త ఎక్స్ క్లూజివ్ ఆఫర్ అందుబాటులో ఉంటుందని టెలికాం దిగ్గజం ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. రూ. 299 లేదా అంతకంటే ఎక్కువ ప్లాన్ తో రిఛార్జ్ చేసుకుంటే చాలు ఈ క్రేజీ బెనిఫిట్స్ మీరు పొందవచ్చు. ఈ నేపథ్యంలో జియో తాజా ఆఫర్ కు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.
జియో సిమ్ కొత్తగా తీసుకుంటున్నవారు లేదా ఇప్పటికే వినియోగిస్తున్న వారు ఇంతకుముందు ఎప్పుడూ లేనివిధంగా అల్టిమేట్ క్రికెట్ సీజన్ ను ఎక్స్ పీరియెన్స్ చేసేందుకు రూ. 299లేదా అంతకంటే ఎక్కువ ప్లాన్ తో రీఛార్జ్చేయాలి. రీఛార్జ్ లేదా కొత్త సిమ్ కొనుగోలు మార్చి 17 నుంచి మార్చి 31, 2025 మధ్య చేయాలి.
మార్చి 17కు ముందు రీఛార్జ్ చేసుకున్న ప్రస్తుత జియో సిమ్ కస్టమర్లు రూ. 100 యాడ్ ఆన్ ప్యాక్ ను ఎంచుకోవచ్చు. 4కేలో టీవీ లేదా మొబైల్ పై 90 రోజుల ఫ్రీ జియో హాట్ స్టార్ వినియోగదారులు ఈ సీజన్ లోని ప్రతి క్రికెట్ మ్యాచ్ ను తమ హోం టెలివిజన్ లేదా మొబైల్ ఫోన్ లో ఎలాంటి అదనపు ఖర్చు లేకుండా 4కేలో వీక్షించవచ్చు. ఇళ్లకు 50రోజుల ఫ్రీ జియో ఫైబర్ లేదా ఎయిర్ ఫైబర్ ట్రయల్ కనెక్షన్ వినియోగదారులు అల్ట్రా ఫాస్ట్ ఇంటర్నెట్ , 4కేలో నిజంగా అద్భుతమైన క్రికెట్ ఎక్స్ పీరియన్స్ కోసం ఫ్రీ హోం ఎంటర్ టైన్మెంట్ పొందవచ్చు. 50రోజుల ఫ్రీ జియో ఫైబ్ ట్రయల్ లో 800కు పైగా ఛానళ్లు, 11కి పైగా ఓటీటీ యాప్స్, అన్ లిమిటెడ్ వైఫై వంటిఫీచర్లు ఉన్నాయి.
జియో హాట్ స్టార్ ప్యాక్ 2025 మార్చి 22నుంచి 90 రోజుల కాలానికి యాక్టివేట్ అవుతుంది. కస్టమర్లు 60008-60008 నెంబర్ కు మిస్డ్ కాల్ ఇచ్చి ఆఫర్ ప్రయోజనాలను తెలుసుకోవచ్చు. జియో.కామ్ లేదా సమీపంలోని జియో స్టోర్ కు కూడా వెళ్లాలి. మార్చి 22న కోల్ కతా నైట్ రైడర్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచుతో ఐపీఎల్ 18 సీజన్ ప్రారంభం కాబోతుంది. ఇండియాలో ఐపీఎల్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. సరిగ్గా ఈ సమయంలోనే జియో ఇలాంటి ఎక్స్ క్లూజివ్ ఆఫర్ ను తీసుకోవడంతో క్రికెట్ లవర్స్ కు పండగే అని చెప్పవచ్చు.