ప్రపంచ వ్యాప్తంగా 5జీ రాకముందే.. 6జీని సిద్ధం చేసిన జపాన్..
కాలం మారుతుంది.. కాలంతో పాటు టెక్నాలజీ కూడా అభివృద్ధి చెందుతుంది.
దిశ, ఫీచర్స్ : కాలం మారుతుంది.. కాలంతో పాటు టెక్నాలజీ కూడా అభివృద్ధి చెందుతుంది. ల్యాండ్ ఫోన్ ను వదిలేసి స్మార్ట్ ఫోన్ వాడకానికి జనాలు అడిక్ట్ అయిపోతున్నారు. పెరిగిన టెక్నాలజీ, స్మార్ట్ ఫోన్ల సాయంతో ఎక్కడో జరిగిన సమాచారాన్ని కూడా క్షణాల్లో తెలుకుంటున్నారు. అయితే స్మార్ట్ ఫోన్ లో ఏ విషయాలైనా స్పీడ్ గా శోధించాలంటే నెట్ వర్క్ కూడా స్పీడ్ కూడా చాలా అవసరం. నిన్న మొన్నటి వరకు 2జీ, 3జీ, 4జీ నెట్ వర్క్ ను వాడిన వినియోగదారులు ప్రస్తుతం 5జీ టెక్నాలజీకి మారిపోయింది. అయితే కొంతమంది వినియోగదారులు మాత్రం 5జీ స్పీడ్ నెట్ వర్క్ వాడుతూ కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ స్పీడ్ కాకుండా ఇంకాస్త స్పీడ్ పెరిగితే బాగుండు ఆలోచిస్తున్నారు. ఈ క్రమంలోనే కొన్ని టెలికాం కంపెనీలు 6G నెట్ వర్క్ ను అందుబాటులోకి తీసుకువచ్చాయి. మరి ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
జపాన్ కు చెందిన దిగ్గజ టెలికాం కంపెనీలు 6G నెట్ వర్క్ ను అందుబాటులోకి తీసుకువచ్చాయి. NTT కార్పొరేషన్లు, NEC, DOCOMO, ఫుజిట్సు వంటి కొన్ని టెలికాం కంపెనీలు 6G ప్రోటోటైప్ పరికరాన్ని తయారు చేసింది. దీంతో ప్రపంచంలోనే మొదటి 6జీ ప్రోటోటైప్ ని కనిపెట్టిన దేశంగా జపాన్ పేరు తెచ్చుకుంది. ఇది సెకనుకు 100 గిగాబైట్ల (Gbps) వేగంతో డేటాను ప్రసారం చేయగలదు. ఇది 300 అడుగుల కంటే ఎక్కువ ఉంటుంది. 6జీ ఇంటర్ నెట్ స్పీడ్ 5జీ స్పీడ్ కంటే కూడా 20 రెట్లు ఎక్కువగా ఉంటుంది.
Read More...
కొనుగోలుదారుడికి యూజ్ చేసిన ల్యాప్‌టాప్ పంపిన అమెజాన్.. చివరికి ఏమైందంటే..?