iQ00 13: రేపే భారత మార్కెట్లో ఐక్యూ 13 ఫోన్ లాంచ్.. స్పెసిఫికేషన్స్ వివరాలివే..!
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ, వివో(Vivo) సబ్ బ్రాండ్ ఐక్యూ(iQ00) నుంచి కొత్త ఫోన్ రేపే ఇండియన్ మార్కెట్లోకి లాంచ్ కాబోతుంది.
దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ, వివో(Vivo) సబ్ బ్రాండ్ ఐక్యూ(iQOO) నుంచి కొత్త ఫోన్ రేపే ఇండియన్ మార్కెట్లోకి లాంచ్ కాబోతుంది. ఐక్యూ 13(iQ00 13)' పేరుతో దీన్ని రిలీజ్ చేయబోతున్నారు. . అయితే దీని ధరను కంపెనీ అధికారంగా ప్రకటించకపోయిన 12 జీబీ ర్యామ్+256 జీబీ స్టోరేజీ వేరియంట్ ధర రూ.55,000గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఈ ఫోన్ నాలుగు సంవత్సరాల పాటు ఆండ్రాయిడ్ ఓఎస్(Android OS), ఐదేళ్ల పాటు సెక్యూరిటీ అప్ డేట్స్(Security Updates) అందిస్తుంది.
ఐక్యూ 13(iQ00 13) ఫోన్ ఫీచర్ల వివరాలు..
- 6.82 అంగుళాల LTOP అమోలెడ్ డిస్‌ప్లే విత్ 2K రిజల్యూషన్
- క్వాల్ కామ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్(Qualcomm Snapdragon 8 Elite Processor)
- 12జీబీ ర్యామ్+256జీబీ రోమ్(12GB RA+256GB ROM)
- 144Hz రిఫ్రెష్ రేట్(144Hz Refresh Rate)
- ఇక బ్యాక్ సైడ్ 50 మెగా పిక్సెల్ ప్రైమరీ(Sony IMX921) కెమెరా, 50 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా, 50 మెగా పిక్సెల్ 2ఎక్స్ టెలిఫోటో కెమెరాలతో రాబోతుంది.
- సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరాను ఇందులో అమర్చారు.
- 120W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 6000mAh కెపాసిటీ గల బ్యాటరీ కలిగి ఉంది.