Honor Choice smartwatch : AMOLED డిస్‌ప్లేతో హానర్ కొత్త స్మార్ట్‌వాచ్

చైనాకు చెందిన హానర్ కంపెనీ ఇండియాలో కొత్త మోడల్‌ను విడుదల చేయబోతుంది. దీని పేరు ‘Honor Choice’.

Update: 2024-02-02 08:27 GMT

దిశ, టెక్నాలజీ: చైనాకు చెందిన హానర్ కంపెనీ ఇండియాలో కొత్త మోడల్‌ను విడుదల చేయబోతుంది. దీని పేరు ‘Honor Choice’. ఇది ఫిబ్రవరి 15న మార్కెట్లో Honor X9bతో పాటు లాంచ్ అవుతుందని టిప్‌స్టర్ ముకుల్ శర్మ ఎక్స్‌లో పేర్కొన్నారు. ఈ వాచ్‌ ప్రత్యేకంగా SOS కాల్ బటన్‌ను కలిగి ఉంటుందని అతను తెలిపాడు. ఇది, 410 x 502 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 1.95-అంగుళాల AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. దీని రిఫ్రెష్ రేట్ 60Hz. 550 నిట్‌ల వరకు బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంటుంది. వాచ్‌ను మాగ్నెటిక్ చార్జింగ్ ద్వారా చార్జింగ్ చేయవచ్చు. ఇది 5ATM రేటింగ్‌‌తో వస్తుంది.


ఎక్కువ రోజుల బ్యాటరీ లైప్ కోసం 300mAh బ్యాటరీని అమర్చారు. దీంతో 12 రోజుల వరకు వాడుకోవచ్చని కంపెనీ ఆఫర్ చేస్తుంది. ఈ వాచ్ బ్లాక్, వైట్ కలర్స్‌లలో లభిస్తుంది. బ్లూటూత్ కాలింగ్ ఫీచర్ ద్వారా వాచ్ నుంచే నేరుగా కాల్స్‌కు ఆన్సర్ చేయవచ్చు. స్మార్ట్‌వాచ్ 100 అనుకూలీకరించదగిన వాచ్ ఫేస్‌లు, 120కి పైగా వర్కౌట్ మోడ్‌లను కలిగి ఉంటుంది. అలాగే యూజర్ల హెల్త్ కోసం హృదయ స్పందన రేటు, రక్త ఆక్సిజన్ స్థాయి, ఒత్తిడి, నిద్ర వంటి ఫీచర్లను కూడా కలిగి ఉంది.

Tags:    

Similar News