iphone: ఐఫోన్ యూజర్లకు షాక్.. ప్రభుత్వం హెచ్చరిక

దిశ, వెబ్‌డెస్క్: ఐఫోన్ వాడే వాళ్ల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. అప్పు చేసైనా ఐఫోన్ కొనాలనుకునే వారు కూడా పెరుగుతున్నారు. అయితే, తాజాగా..

Update: 2022-09-14 07:12 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఐఫోన్ వాడే వాళ్ల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. అప్పు చేసైనా ఐఫోన్ కొనాలనుకునే వారు కూడా పెరుగుతున్నారు. అయితే, తాజాగా ఐఫోన్ యూజర్స్‌కు భారత ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని సూచించింది. కొన్ని యాపిల్ ప్రొడక్ట్స్‌లో బలహీనతల కారణంగా అవి సైబర్ దాడులకు దారి తీస్తాయని ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (సీఈఆర్-ఇన్) యాపిల్ యూజర్లకు ప్రత్యేక మార్గదర్శకాలను జారీ చేసింది. ప్రతి యాపిల్ వినియోగదారుడు తమతమ ప్రొడక్ట్స్‌ను వెంటనే అప్‌డేట్ చేయాలని కోరింది. 'యాపిల్ ప్రొడక్ట్స్‌లో అనేక బలహీనతలు కనిపించాయి.

వాటి కారణంగా సైబర్ దాడులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. వాటి కారణంగా దాడి చేసిన వ్యక్తి మీ డాటాను దొంగలించడమే కాకుండా మీ వస్తువుపై పూర్తి అధికారం సాధించగలుగుతాడు, ఆర్బిటరీ కోడ్‌ను క్రియేట్ చేయగలుగుతాడు. వాటితో పాటుగా టార్గెట్ చేసిన వస్తువు సెక్యూరిటీ నిబంధనలను బైపాస్ చేయగలుగుతాడు' అని ఏజెన్సీ తన అడ్వైసరీలో పేర్కొంది. అంతేకాకుండా ఐఫోన్ 8 మోడల్‌తో వచ్చిన ఐఓఎస్ 16 కన్నా ముందు ఐఓఎస్ వెర్షన్ ఫోన్‌లలో ఈ బలహీనతలు ఉన్నాయని, ఈ పరికరాల జాబితాలో ఐఓఎస్, ఐపాడ్ఓఎస్ వెర్షన్ 15.7 కన్నా తక్కువ డివైస్‌లు ఉన్నాయని ఏజెన్సీ తెలిపింది.

ఐఫోన్ 6ఎస్ ఆ తర్వాత వచ్చిన ఫోన్‌లు

ఐప్యాడ్ ప్రో (అన్ని మోడళ్లు)

ఐప్యాడ్ ఎయిర్ 2, ఆ తర్వాత వచ్చిన మోడల్స్

ఐప్యాడ్ 5 జనరేషన్, ఆ తర్వాత వచ్చినవి

ఐప్యాడ్ మిని 4 ఆ తర్వాత మోడళ్లు

ఐప్యాడ్ టచ్ (7 జనరేషన్)

వీటితో పాటుగా మ్యాక్ ఓఎస్ మోన్‌టెరే వెర్షన్ 12.6 కన్నా తక్కువ, యాపిల్ మ్యాక్ఓఎస్ బిగ్ సుర్ వెర్షన్ 11.7 కన్నా తక్కువ, యాపిల్ సఫారీ 16 వెర్షన్ కన్నా తక్కువ వెర్షన్ ల్యాప్‌టాప్‌లో ఈ జాబితాలో కలుస్తాయని ఏజెన్సీ తెలిపింది.

Tags:    

Similar News