Garmin Launches Forerunner 965 265: మార్కెట్లోకి కొత్తగా మూడు స్మార్ట్‌వాచ్‌లు
గార్మిన్ కంపెనీ ఇండియాలో కొత్తగా మూడు స్మార్ట్‌వాచ్‌లను విడుదల చేసింది. ఈ మోడల్స్ పేరు.. ఫార్‌రన్నర్ 965, ఫార్‌రన్నర్ 265 మ్యూజిక్, ఫార్‌రన్నర్ 265S మ్యూజిక్.
దిశ, వెబ్‌డెస్క్: గార్మిన్ కంపెనీ ఇండియాలో కొత్తగా మూడు స్మార్ట్‌వాచ్‌లను విడుదల చేసింది. ఈ మోడల్స్ పేరు.. ఫార్‌రన్నర్ 965, ఫార్‌రన్నర్ 265 మ్యూజిక్, ఫార్‌రన్నర్ 265S మ్యూజిక్. ఏప్రిల్ 30 నుండి Amazon, Flipkart, ఆఫ్‌లైన్ స్టోర్‌ల ద్వారా కొనుగోలుకు అందుబాటులో ఉన్నాయి. ఫార్‌రన్నర్ 265 సిరిస్ వాచ్‌లు రూ. 50,490 ధరలో లభిస్తాయి. అదే ఫార్‌రన్నర్ 965 ధర రూ. 67,490.
గార్మిన్ ఫార్‌రన్నర్ 265 మ్యూజిక్, 265ఎస్ మోడల్స్ వాచ్‌లు రెండూ ఒకే విధమైన కీలక స్పెసిఫికేషన్‌లను కలిగి ఉన్నాయి. 1.1-అంగుళాల AMOLED డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటక్షన్ కలిగి ఉన్నాయి. ఫార్‌రన్నర్ 265 మ్యూజిక్ స్మార్ట్‌వాచ్ మోడ్‌లో 13 రోజుల వరకు, GPS మోడ్‌లో 20 గంటల వరకు బ్యాటరీ లైఫ్ ఉంటుందని కంపెనీ పేర్కొంది. 265S మ్యూజిక్ స్మార్ట్‌వాచ్ మోడ్‌లో 15 రోజులు, GPS మోడ్‌లో 24 గంటల వరకు బ్యాటరీ లైఫ్ ఉంటుంది. రెండు వాచ్‌లు కూడా హృదయ స్పందన రేటు, నిద్ర, SpO2, ఋతు చక్రాలను ట్రాకింగ్, 30కి పైగా స్పోర్ట్స్ మోడల్ లను కలిగి ఉంది.
గార్మిన్ ఫార్‌రన్నర్ 965 మోడల్ 1.4-అంగుళాల AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 DX ప్రొటక్షన్, హృదయ స్పందన రేటు, రక్త ఆక్సిజన్ స్థాయి, నిద్ర, ఋతు చక్రం, ఫిట్‌నెస్ ట్రాకింగ్ మొదలగు ఫీచర్స్ ఉన్నాయి. స్మార్ట్‌వాచ్ మోడ్‌లో, 23 రోజుల వరకు, GPS మోడ్‌లో 31 రోజుల బ్యాటరీ లైఫ్ అందించగలదని కంపెనీ తెలిపింది.