SIM cards:వచ్చే నెల నుంచి కొత్త రూల్..అలా చేస్తే సిమ్ కార్డు బ్లాక్!

ప్రస్తుత కాలంలో టెక్నాలజీ ఎంతగా అభివృద్ధి చెందిందో చూస్తూనే ఉన్నాం. అయితే ఇటీవల సైబర్ మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి.

Update: 2024-08-13 08:40 GMT

దిశ,వెబ్‌డెస్క్:ప్రస్తుత కాలంలో టెక్నాలజీ ఎంతగా అభివృద్ధి చెందిందో చూస్తూనే ఉన్నాం. అయితే ఇటీవల సైబర్ మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి. చాలా మంది సైబర్ క్రైమ్స్ బారిన పడి తమ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఈ సైబర్ మోసగాళ్లు కొత్త కొత్త ప్లాన్స్‌తో వచ్చేస్తున్నారు. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి. సైబర్ మోసాల బారిన పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక ప్రజెంట్ విపరీతంగా పెరుగుతున్న స్పామ్ కాల్స్, సైబర్ నేరాలను దృష్టిలో పెట్టుకుని టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) ఓ కొత్త నిబంధనను అమల్లోకి తీసుకొస్తోందనే వార్తలు వినిపిస్తున్నాయి.

నకిలీ స్పామ్ కాల్స్‌ను దృష్టిలో పెట్టుకుని సెప్టెంబర్ 1 నుంచి TRAI కొత్త రూల్ అమలు చేయనుంది. వ్యక్తిగత ఫోన్ నెంబర్ నుంచి మార్కెటింగ్, ప్రమోషనల్ కాల్స్ చేస్తే టెలికం ప్రొవైడర్ ఆ నంబర్‌ను రెండేళ్లు బ్లాక్ చేయాలని ఆదేశించింది. స్పామ్ కాల్స్ పేరుతో మోసాలు పెరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకుంది. అటు స్పామ్, ఫ్రాడ్ కాల్స్‌కు భారీగా కనెక్షన్లు వాడే సంస్థలను బ్లాక్‌లిస్టులో చేర్చాలని TRAI స్పష్టం చేసింది. కస్టమర్ల ప్రాబ్లమ్స్‌కి చెక్ పెట్టేందుకు నిబంధనలను కఠినతరం చేయబోతుందంట. ఈ మేరకు టెలికాం సర్వీస్ ప్రొవైడర్‌కు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.

Tags:    

Similar News