చంద్రుని కక్ష్యలోకి మొదటి ప్రైవేట్ మూన్ ల్యాండర్.. ఫిబ్రవరి 22న ల్యాండింగ్ డేట్ ఫిక్స్..

1972 సంవత్సరం ప్రారంభంలో NASA తన చివరి మూన్ ల్యాండర్ అపోలో 17 ను ప్రారంభించింది.

Update: 2024-02-15 11:40 GMT

దిశ, ఫీచర్స్ : 1972 సంవత్సరం ప్రారంభంలో NASA తన చివరి మూన్ ల్యాండర్ అపోలో 17 ను ప్రారంభించింది. ఆ తర్వాత అమెరికా చంద్రుడిపైకి వెళ్లేందుకు ప్రయత్నించలేదు. అయితే 52 సంవత్సరాల తర్వాత, అమెరికా చంద్రుని పై అంతరిక్ష నౌకను ల్యాండ్ చేస్తుంది.

SpaceX ఒక ప్రైవేట్ కంపెనీకి చెందిన మూన్ ల్యాండర్‌ను చంద్రుని కక్ష్యలోకి పంపింది. అదే హ్యూస్టన్‌కు చెందిన ఇంటూటివ్ మెషీన్స్ నిర్మించిన రోబోటిక్ లూనార్ ల్యాండర్ ఒడిస్సియస్. దీనిని IM-1 ల్యాండర్ అని కూడా పిలుస్తారు. దీన్ని ప్రయోగించేందుకు స్పేస్‌ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్‌ను ఉపయోగించారు. ఇది ఫిబ్రవరి 22న చంద్రుని దక్షిణ ధ్రువంలో దిగుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ ల్యాండర్ నాసా వాణిజ్య కార్యక్రమం - లూనార్ పేలోడ్ సర్వీస్ కింద నిర్మించారు. దాని ప్రయోగానికి, NASA 118 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 980 కోట్లు) ఇంట్యూటివ్ మెషీన్స్‌తో ఒప్పందం కుదుర్చుకుంది.

ఇంధనం కారణంగా లాంచ్ ఆలస్యం..

ముందుగా ఈ మిషన్‌ను ఫిబ్రవరి 14న ప్రారంభించాల్సి ఉండగా విండో ఇంధన సమస్య (మీథేన్ ఉష్ణోగ్రతలో మార్పు) కారణంగా ఆలస్యం జరిగింది. దీని తర్వాత ఫిబ్రవరి 15న మిషన్ ను ప్రారంభించారు. ప్రయోగం విజయవంతమైతే, ఈ ల్యాండర్ ఫిబ్రవరి 22న చంద్రుడి ఉపరితలం పై ల్యాండ్ అవుతుంది. IM-1 ఒడిస్సిఎస్ ప్రైవేట్ లూనార్ ల్యాండర్ మొత్తం 16 రోజుల మిషన్. చంద్రుని ఉపరితలం పై దిగిన తర్వాత, ఇది 7 రోజులు పని చేస్తుంది.




Similar News