అధునాతన ఫీచర్స్‌ ఉండే స్మార్ట్‌వాచ్ కొనాలనుకుంటున్నారా..! అయితే ఇది మీకోసమే..

Fire-Boltt కంపెనీ కొత్తగా బ్లూటూత్ కాలింగ్ స్మార్ట్‌వాచ్‌ను ఇండియాలో లాంచ్ చేసింది.

Update: 2023-05-17 11:44 GMT

దిశ, వెబ్‌డెస్క్: Fire-Boltt కంపెనీ కొత్తగా బ్లూటూత్ కాలింగ్ స్మార్ట్‌వాచ్‌ను ఇండియాలో లాంచ్ చేసింది. ఈ మోడల్ పేరు ‘Fire-Boltt Shark(ఫైర్-బోల్ట్ షార్క్)’. దీని ధర రూ.1,799. కంపెనీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా అమ్మకానికి అందుబాటులో ఉంది. ఇది బ్లాక్, గ్రీన్ ఎల్లో, బ్లాక్ కామౌ, బ్లాక్ ఎల్లో అనే నాలుగు కలర్స్‌లో లభిస్తుంది.



Fire-Boltt Shark స్మార్ట్‌వాచ్ ఫీచర్స్:

స్మార్ట్‌వాచ్ 240x284 పిక్సెల్ రిజల్యూషన్‌తో 1.83-అంగుళాల (240x284 పిక్సెల్‌లు) HD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది బ్లూటూత్ కాలింగ్‌ ఫీచర్‌ను సపోర్ట్ చేస్తుంది. దీంతో వినియోగదారులు కాల్స్‌ను మాట్లడటానికి అలాగే, చేయడానికి వీలు ఉంటుంది. ఇది షాక్‌ప్రూఫ్, స్క్రాచ్ రెసిస్టెంట్ ఫీచర్ ద్వారా వస్తుంది.

ఇది SpO2 మానిటరింగ్, హార్ట్ రేట్ మానిటర్, స్లీప్ ట్రాకర్ వంటి హెల్త్ ట్రాకింగ్ ఫీచర్స్‌ను కలిగి ఉంది. అలాగే అథ్లెటిక్స్, ఆటో రేసింగ్ వంటి 120కి పైగా స్పోర్ట్స్ మోడ్‌లు,100 క్లౌడ్-ఆధారిత వాచ్ ఫేస్‌లకు సపోర్ట్ ఇస్తుంది. స్మార్ట్‌వాచ్ Google అసిస్టెంట్, సిరి వంటి AI వాయిస్ అసిస్టెంట్‌లను కలిగి ఉంది.

వాచ్‌లో ఇన్‌బిల్ట్ గేమ్‌లు, రిమోట్ కెమెరా కంట్రోల్, అలారం, టైమర్, స్టాప్‌వాచ్, వాతావరణ సూచన, సెడెంటరీ రిమైండర్‌లు వంటి మరిన్ని ఉన్నాయి. ఇంకా స్మార్ట్ నోటిఫికేషన్‌లు, Find My Phone సపోర్ట్ కూడా ఉంది. గరిష్టంగా ఎనిమిది రోజుల వరకు బ్యాటరీ లైఫ్ ఉంటుంది. స్టాండ్‌బై మోడ్‌లో 25 రోజుల వరకు బ్యాటరీ లైఫ్ వస్తుందని కంపెనీ పేర్కొంది.

Also Read..

అదిరిపోయే ఫీచర్స్‌తో బ్లూటూత్ కాలింగ్‌ స్మార్ట్‌వాచ్‌ను లాంచ్ చేసిన ‘Boat’ 

Tags:    

Similar News