Facebook-Instagram క్రాస్ చాటింగ్ బంద్!
మెటా యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది.
దిశ, వెబ్‌డెస్క్: మెటా యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. ఒక ప్లాట్‌ఫారమ్ నుంచి మరోక ప్లాట్‌ఫారమ్‌కు మెసేజ్‌లు, కాల్స్ చేయడం వంటి క్రాస్ చాటింగ్ సదుపాయాన్ని నిలిపివేయనున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొంది. ప్రస్తుతం Facebook మెసెంజర్ నుంచి Instagramకు, ఇన్‌స్టాగ్రామ్ నుంచి మెసెంజర్‌కు కాల్స్ చేయడం లేదా మెసేజ్‌లు చేయడం అందుబాటులో ఉండగా, ఇక మీదట ఆ సదుపాయాన్ని తొలగించనున్నారు. ప్రస్తుత డిసెంబర్ నెలలోనే దీన్ని అమల్లోకి తీసుకురానున్నారు. ఈ క్రాస్ చాటింగ్ ఫీచర్‌ను మెటా 2020లో తీసుకొచ్చింది. దీన్ని నిలిపేయడంతో వినియోగదారులు రెండు ప్లాట్‌ఫారమ్‌లలో వారి ఫ్రెండ్స్‌తో చాటింగ్ చేయడానికి విడివిడిగా ఆయా యాప్‌లలో చాటింగ్ చేయాల్సి ఉంటుంది.