WhatsApp లో ఈమెయిల్ వెరిఫికేషన్ ఆప్షన్!

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌లో మరో కొత్త లాగిన్ ఆప్షన్‌ను తీసుకురావడానికి కంపెనీ ప్రయత్నాలు చేస్తుంది

Update: 2023-11-06 11:57 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌లో మరో కొత్త లాగిన్ ఆప్షన్‌ను తీసుకురావడానికి కంపెనీ ప్రయత్నాలు చేస్తుంది. iOS, ఆండ్రాయిడ్ వినియోగదారులు యాప్‌లో ఈమెయిల్‌ను యాడ్ చేసుకునే సదుపాయాన్ని కంపెనీ తెస్తుంది. ఫోన్ నంబర్‌, ఇంకా వన్-టైమ్ పాస్‌వర్డ్ (OTP) ద్వారా అకౌంట్‌కు లాగిన్ కావడానికి ఇప్పటికే ఆప్షన్ ఉండగా, ఇప్పుడు ఈమెయిల్‌ను కూడా యాడ్ చేయడం ద్వారా లాగిన్ టైంలో మెయిల్‌కు వెరిఫికేషన్ మెసేజ్ వస్తుంది. దీంతో కూడా లాగిన్ కావచ్చు. యూజర్లకు వచ్చే ఈమెయిల్ వెరిఫికేషన్ ప్రైవేట్‌గా ఉంటుందని కంపెనీ పేర్కొంది.


ప్రయాణాలు చేస్తున్నప్పుడు అంతర్జాతీయ రోమింగ్ మొబైల్ నెట్‌వర్క్ అందుబాటులో లేని సమయాల్లో ఈమెయిల్ సదుపాయం బాగా ఉపయోగపడుతుందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఇది iOS 2.23.23.77 WhatsApp బీటా, Android 2.23.24.10 లో టెస్టింగ్ కోసం అందుబాటులో ఉంది. త్వరలో అధికారికంగా విడుదల కానుంది. WhatsApp ఖాతాకు మీ ఈమెయిల్‌ను యాడ్ చేయడానికి సెట్టింగ్‌ మెనులో అకౌంట్‌పై క్లిక్ చేసి ఈమెయిల్‌ ఆప్షన్‌ను ఎంచుకోవాలి.


Similar News