ఎలన్ మస్క్ యూటర్న్.. ట్విట్టర్ లోగో మళ్లీ మార్పు!
ట్విట్టర్‌ను సొంతం చేసుకున్న నాటి నుంచి ట్విట్టర్‌లో అనేక మార్పులు చేర్పులు చేసుకుంటూ వస్తున్న ఆ సంస్థ సీఈఓ ఎలన్ మస్క్ తాజాగా యూటర్న్ తీసుకున్నారు.
దిశ, డైనమిక్ బ్యూరో: ట్విట్టర్‌ను సొంతం చేసుకున్న నాటి నుంచి ట్విట్టర్‌లో అనేక మార్పులు చేర్పులు చేసుకుంటూ వస్తున్న ఆ సంస్థ సీఈఓ ఎలన్ మస్క్ తాజాగా యూటర్న్ తీసుకున్నారు. మూడు రోజుల కిందట ట్విట్టర్ లోగో అయిన బ్లూ బర్డ్ స్థానంలో కుక్క ఫోటో (డోజ్ మీమ్)ను పెట్టిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ట్విట్టర్ లోగోను డోజ్ మీమ్ నుంచి మళ్లీ బ్లూ బర్డ్‌కు మార్చుతూ అప్ డేట్ చేశారు. మూడు రోజుల్లో మస్క్ మనసు మార్చుకోవడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. కాగా బ్లూ బర్డ్ స్థానంలో డోజ్ మీమ్‌ను అప్ డేట్ చేయాలని అని ఓ నెటిజన్ కోరగా అతడి కోరిక మేరకు మస్క్ బ్లూ బర్డ్‌ను మార్చినట్లు గతంలో చెప్పారు.