Mobile charging : డార్క్ మోడ్ పెట్టుకోవడం వలన మన మొబైల్ ఛార్జింగ్ సేవ్ అవుతుందా.. అందులో నిజం ఎంత ఉందంటే?

ప్రస్తుతం ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్ వాడుతున్నారు. చిన్నవారి నుంచి పెద్దవారి వరకు స్మార్ట్ ఫోన్ లేకుండా ఎవరు ఉండటం లేదు. ఇక ఫోన్ ఫీచర్లలో బ్యాటరీ సామర్థ్యం చాలా ముఖ్యమైనది. కొన్ని ఫోన్లలో బ్యాటరీ

Update: 2024-08-01 16:51 GMT

దిశ, ఫీచర్స్ : ప్రస్తుతం ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్ వాడుతున్నారు. చిన్నవారి నుంచి పెద్దవారి వరకు స్మార్ట్ ఫోన్ లేకుండా ఎవరు ఉండటం లేదు. ఇక ఫోన్ ఫీచర్లలో బ్యాటరీ సామర్థ్యం చాలా ముఖ్యమైనది. కొన్ని ఫోన్లలో బ్యాటరీ సామర్థ్యం చాలా తక్కువగా ఉంటుంది. ఊరికూరికే ఛార్జింగ్ అయిపోతుంటుంది. అయితే ఇలా చార్జింగ్ అయిపోతుంటే కొందరు కొన్ని టిప్స్ పాటిస్తుంటారు. ముఖ్యంగా ఫోన్‌లో డార్క్ మోడ్ ఆన్ చేస్తుంటారు. ఎందుకంటే ? దీని వలన ఛార్జింగ్ త్వరగా అయిపోకుండా ఉండటమే కాకుండా బ్యాటరీ లైఫ్ సేవ్ చేసుకోవచ్చు. అది ఎలా అనుకుంటున్నారా?

సాధారణంగా ఫోన్ డిస్ ప్లేస్ రెండు రకాలుగా ఉంటాయి. అందులో ఒకటి ఎల్‌సీడీ, రెండోదీ ఎల్ ఈడీ. ఈరెండు డిస్ ప్లే‌లలో LCD డిస్ ప్లేస్ పూర్తి నలుపును చూపించలేవంట, ఒకే స్క్రీన్ మీద బొమ్మ కనిపించాలంటే మొత్తం స్క్రీన్ పని చేయాల్సి ఉంటుంది. కానీ ఎల్‌ఈడీలు మాత్రం ఎక్కడ నలుపురంగు ఉంటుందో ఆ భాగం పని చేయక్కర్లేదు. అంటే డార్క్ మోడ్ ఆన్ చేసినప్పుడు చాలా భాగాలు నలుపు రంగులోకి మారిపోయి విద్యుత్ సేవ్ అవుతుంది. అంటే మన ఫోన్ ప్యానల్ బట్టీ డార్క్ మోడ్ వలన ఛార్జింగ్ సేవ్ అవుతోంది. అంతేకాకుండా మరో విధంగా కూడా డార్క్ మోడ్ వలన మన ఫోన్ ఛార్జింగ్ సేవ్ అవుతోందని చెప్పవచ్చు. ఎలా అంటే? ఈ ఫీచర్ వలన ఫోన్‌లోని పిక్సెల్స్ , బ్యాగ్రౌండ్‌ను డిసేబుల్ చేస్తుంది. దీంతో పాటు డార్క్ వాల్ పేపర్, సిస్టంలోని డార్క్ థీమ్ వంటి వాటి వన్నీ కూడా డార్క్ మోడ్‌లోకి మారిపోతాయి, యూట్యూబ్, వాట్సాప్,ట్విట్టర్ జీమెయిల్ వంటి అప్లికేషన్స్ వంటి వాటన్నింటి కూడా డార్క్ మోడ్ ఆన్ చేసుకోవడం వలన ఛార్జింగ్ సేవ్ అవుతోంది.

Tags:    

Similar News