ఫ్రీగా జియో ట్యూన్ సెట్ చేయడం ఎలానో తెలుసా?

ప్రస్తుం చాలా మంది జియో నెట్ వర్క్ నే వాడుతున్నారు. అయితే ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ కాలర్ ట్యూన్ మంచిది పెట్టుకోవాలని అనుకుంటారు. అయితే కొంత మందికి జియో ట్యూన్ సెట్ చేసుకోవడం సరిగా రాదు. మరీ ముఖ్యంగా మనీ

Update: 2024-05-31 07:51 GMT

దిశ, ఫీచర్స్ : ప్రస్తుం చాలా మంది జియో నెట్ వర్క్ నే వాడుతున్నారు. అయితే ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ కాలర్ ట్యూన్ మంచిది పెట్టుకోవాలని అనుకుంటారు. అయితే కొంత మందికి జియో ట్యూన్ సెట్ చేసుకోవడం సరిగా రాదు. మరీ ముఖ్యంగా మనీ పెట్టి నచ్చిన సాంగ్ కాలర్ ట్యూన్‌గా సెట్ చేసుకుంటారు. అయితే ఫ్రీగా కూడా ఈ జియో ట్యూన్ సెట్ చేసుకోవచ్చు. అది ఎలానో ఇప్పుడు తెలుసుకుందాం. జియో సిమ్ యూస్ చేసే ప్రతి ఒక్కరికీ మై జియో యాప్ అనేది తప్పకుండా ఉంటుంది. అయితే దీని ద్వారా ఈజీగా కాలర్ ట్యూన్ సెట్ చేసుకోవచ్చు. యాప్‌లోకి వెళ్తే జియో ట్యూన్స్ ఆప్షన్ కనిపిస్తుంది. దానిని క్లిక్ చేయగానే సెర్చ్ బటన్ కనిపిస్తుంది. దీంతో మీకు ఇష్టమైన పాటను సెర్చ్ చేసి, కాలర్ ట్యూన్ సెట్ చేసుకోవాలి. అలాగే మై జియో యాప్ గురించి కూడా తెలిసిందే. దీని ద్వారా కూడా జియో ట్యూన్ సెట్ చేసుకోవచ్చు. జియో ట్యూన్స్ హోమ్ పేజీలో మీకు జియో ట్యూన్, రింగ్ టోన్ అనే రెండు ఆప్షన్లు కనిపిస్తాయి.

అందులో జియో ట్యూన్ ఆప్షన్‌పై క్లిక్ చేసినప్పుడు, సెట్ ఆప్షన్ కింద కనిపిస్తుంది. మీరు దానిపై క్లిక్ చేసిన వెంటనే జియో ట్యూన్ ఇన్‌స్టాల్ అవుతుంది. అది యాక్టివెట్ కాగానే ఎస్ ఎమ్ ఎస్ వస్తుంది. అలాగే ఎస్ ఎంఎస్ ద్వారా కూడా జియో ట్యూన్ సెట్ చేసుకోవచ్చు. మీ మొబైల్‌లో మెసేజ్ యాప్‌ని ఓపెన్ చేసి JT అని టైప్ చేసి 56789కి మెసేజ్ పంపండి. దీంతో మీరు జియో ట్యూన్ సెట్ చేసుకోవడానికి కొంత సమాచారాన్ని పంపింస్తుంది. తర్వాత సినిమా పేరు రిప్లే ఇచ్చేసి

దీని తర్వాత మీరు జియో ట్యూన్‌ను ఎలా సెట్ చేయాలి అనే వివరాలతో కూడిన మెసేజ్ అందుతుంది ఒకవేళ అది ఆల్బమ్ అయితే ఆల్బమ్ అని స్పేస్ ఇచ్చి ఆల్బమ్ పేరును టైప్ చేసి మెసేజ్ పంపండి. మీరు సింగర్ ద్వారా సెర్చ్ చేయాలనుకుంటే 'సింగర్' అని స్పేస్ ఇచ్చి మెసేజ్ పంపండి.తర్వాత మీకు సాంగ్స్ లిస్ట్ రాగా, దానిని మీకు జియో ట్యూన్‌గా సెట్ చేస్తారు. ఈ ప్రక్రియ చాలా ఈజీగా, త్వరగా అయిపోతుంది.


Similar News