ఇన్ స్టా, ఫేస్ బుక్ మీ పర్సనల్ డేటాను ఎంత తీసుకుంటాయో తెలుసా?

ప్రస్తుతం సైబర్ క్రైమ్ రోజు రోజుకు పెరుగుతోంది. యూజర్స్‌కు తెలియకుండానే తమ వ్యక్తిగ డేటా చోరీ అవుతోంది. దీంతో ప్రతీ ఒక్కరు ఏదైనా యాప్ ఇన్ స్టాల్ చేసినప్పుడు డేటా ఎంట్రీ చేయడానికి మొగ్గుచూపడం లేదు.

Update: 2024-01-21 16:31 GMT

దిశ, ఫీచర్స్ : ప్రస్తుతం సైబర్ క్రైమ్ రోజు రోజుకు పెరుగుతోంది. యూజర్స్‌కు తెలియకుండానే తమ వ్యక్తిగ డేటా చోరీ అవుతోంది. దీంతో ప్రతీ ఒక్కరు ఏదైనా యాప్ ఇన్ స్టాల్ చేసినప్పుడు డేటా ఎంట్రీ చేయడానికి మొగ్గుచూపడం లేదు.

మరీ ముఖ్యంగా స్మార్ట్ ఫోన్‌లోని ప్రతీ యాప్ వ్యక్తిగత సమాచారాన్ని అడుగుతోంది. ఒక వేళ మనం డేటా ఇవ్వకపోతే యాప్ ఇన్ స్టాల్ కావడం లేదు. ఈ క్రమంలో యూజర్ భద్రతే ముఖ్యంగా సర్ఫ్‌షార్క్ అనే సైబర్ సెక్యూరిటీ సంస్థ యాప్ లు స్వీకరించే డేటా విధానాలపై సర్వే చేసింది. దాదాపు 100 ప్రముఖ యాప్ లపై, యాపిల్ ప్రైవసీ పాలసీలో పేర్కొన్న 32 డేటా పాయింట్స్ ఆధారంగా ఈ అధ్యయనం చేసి ఓ నివేదికను వెలువరించింది. ఆ నివేదికలో విస్తు పోయే విషయాలు వెల్లడయ్యాయి. మన వ్యక్తిగత సమాచారాన్ని అత్యధికంగా తీసుకుంటున్న యాప్స్ ఏంటో తెలుసుకుందాం.

మెటా యాజమాన్యంలోని ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ ప్లాట్‌ఫారమ్‌లలోనూ డేటా సేకరణ ఒకే విధంగా ఉన్నాయని పరిశోధకులు అంటున్నారు. మరి ఏ ఇతర యాప్‌లలో లేని విధంగా ఇవిడేటాను స్వీకరిస్తున్నాయంట.అయితే రెండు యాప్‌లు జాబితా చేయబడిన అన్ని డేటా పాయింట్‌లను సేకరించినప్పటికీ, అవి పేరు, చిరునామా, ఫోన్ నంబర్‌తో సహా ట్రాకింగ్ ప్రయోజనాల కోసం ఏడు పాయింట్లను మాత్రమే ఉపయోగించాయని ఆ సంస్థ నివేదిక స్పష్టం చేసింది. ఎక్స్(ట్విట్టర్) మాత్రం అతి తక్కువ డేటాను వినియోగదారు నుంచి సేకరిస్తుందని తెలిపింది. అయితే థర్డ్ పార్టీ యాప్స్ తో భాగస్వామ్యం చేసినప్పుడు ఇది దాదాపు 32 డేటా పాయింట్లను సగం పాయింట్లను యూజర్ ట్రాకింగ్ కోసం వినియోగిస్తున్నట్లు గుర్తంచింది. దీంతో ఎక్స్ లో డేటా షేరింగ్ పద్ధతుల గురించి ఆందోళనలను పెంచుతుంది. దాదాపు 10 సోషల్ మీడియా, మెసేజింగ్ యాప్స్ లలో దాదాపు సగటు కంటే ఎక్కువ డేటాను సేకరిస్తున్నట్లు పరిశోధన వెల్లడించిం

Tags:    

Similar News