Here's how much profit Apple earns every second ?
ఐఫోన్ల తయారీ సంస్థ యాపిల్ సెకనుకు రూ.1.48 లక్షల (1,820 డాలర్లు) లాభాన్ని ఆర్జిస్తున్నట్లు ఓ పరిశోధనా నివేదిక తెలిపింది.
దిశ, వెబ్ డెస్క్: ఐఫోన్ల తయారీ సంస్థ యాపిల్ సెకనుకు రూ.1.48 లక్షల (1,820 డాలర్లు) లాభాన్ని ఆర్జిస్తున్నట్లు ఓ పరిశోధనా నివేదిక తెలిపింది. ఈ లెక్క ప్రకారం సంస్థ ఒక్క రోజులో రూ.1,282 కోట్లు(157 మిలియన్ డాలర్లు) సంపాదిస్తున్నట్లు నివేదికలో పేర్కొన్నారు. లాభాదాయక సంస్థల్లో యాపిల్ అగ్రస్థానంలో ఉన్నట్లు నివేదిక తెలిపింది. అకౌంటింగ్ సాఫ్ట్ వేర్ ఫైనాన్సియల్ టెక్నాలజీ వ్యాపారాన్ని నిర్వహిస్తున్న టిపాల్టీ ఈ నివేదికను రూపొందించింది. దీని ప్రకారం మైక్రోసాఫ్ట్, అల్ఫాబెట్(గూగుల్ మాతృసంస్థ), బెర్క్ షైర్ హథ్ వే(వారెన్ బఫెట్ సంస్థ) కూడా సెకనుకు 1000 డాలర్లకు పైగానే ఆర్జిస్తున్నట్లు తెలిపింది.