WhatsApp నుంచి అదిరిపోయే ఫీచర్
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ కొత్తగా మరో ఫీచర్‌ను విడుదల చేసింది.
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ కొత్తగా మరో ఫీచర్‌ను విడుదల చేసింది. వాట్సాప్‌లోనే డైరెక్ట్‌గా కాంటాక్ట్స్‌ను ఎడిట్ చేయడానికి లేదా సేవ్ చేయడానికి ఉపయోగకరంగా ఉండే కొత్త అప్‌డేట్ వెర్షన్ "న్యూ కాంటాక్ట్" ను యాజమాన్యం ఇటీవల లాంచ్ చేసింది. ఇప్పటికే చాలా మంది వాట్సాప్ యూజర్లకు ఇది అందుబాటులోకి వచ్చింది. ఇంతకుముందు కాంటాక్ట్స్‌ను ఎడిట్/సేవ్ చేయడానికి నార్మల్ ఫోన్ కాంటాక్ట్ సేవింగ్ ఆప్షన్‌లోకి రావాల్సి ఉండేది. అయితే కాంటాక్ట్స్ క్రియేట్ కోసం ప్రతిసారీ ఇలా చేయడం చాలా భారంగా ఉండేది. ఈ కొత్త ఫీచర్ ద్వారా ఆ బాధ తీరుతుందని కంపెనీ పేర్కొంది.
ఈ కొత్త సదుపాయం ద్వారా ఆండ్రాయిడ్ వాట్సాప్ వెర్షన్‌లో ఇంతకుముందే సేవ్ చేసుకున్న కాంటాక్ట్స్‌ను ఎడిట్ చేసుకోవచ్చు. కావాలంటే కొత్తగా క్రియేట్ చేసుకోవచ్చు. దీని కోసం వాట్సాప్‌లో కాంటాక్ట్ లిస్ట్‌ని ఓపెన్ చేస్తే అక్కడ "న్యూ కాంటాక్ట్" అని కనిపిస్తుంది. దాంట్లో డైరెక్ట్‌గా కాంటాక్ట్స్ సేవ్ చేసుకోవచ్చని WABetaInfo నివేదించింది. ప్రస్తుతం ఈ ఫీచర్ కొంత మంది వినియోగదారులకు అందుబాటులోకి రాలేదు. త్వరలో వారికి కూడా అందిస్తామని కంపెనీ పేర్కొంది.
Read more: