సరికొత్త వీ30 స్మార్‌ఫోన్‌ను విడుదల చేసిన వీవో

ఈ స్మార్ట్‌ఫోన్ 3డీ కర్వ్‌డ్ అమోల్‌డ్ స్క్రీన్, 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్, వెనుకవైపు మూడు కెమెరాలతో తీసుకొచ్చారు.

Update: 2024-02-05 10:15 GMT

దిశ, టెక్నాలజీ: చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ వీవో తన కొత్త వీ30 స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. ఎంపిక చేసిన గ్లోబల్ మార్కెట్లలో ఈ మోడల్‌ను కంపెనీ సైలెంట్‌గా తీసుకొచ్చింది. క్వాల్‌కమ్ స్నాప్ డ్రాగన్ 7 జెన్3 చిప్‌సెట్‌తో వస్తున్న ఈ స్మార్ట్‌ఫోన్ 3డీ కర్వ్‌డ్ అమోల్‌డ్ స్క్రీన్, 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్, వెనుకవైపు మూడు కెమెరాలతో తీసుకొచ్చారు. 50-మెగా పిక్సెల్ ఓమ్నీ విజన్, 50-మెగా పిక్సెల్ ఆల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, పోర్ట్‌ట్రెయిట్ సెన్సార్ కెమెరాలను అమర్చారు. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 50 మెగా పిక్సెల్స్ సెన్సార్ కెమెరా ఉంది. ఆండ్రాయిడ్ 14, ఫన్ టచ్ ఓఎస్ కలిగిన ఈ ఫోన్ 6.78 అంగుళాల స్క్రీన్ కలిగి ఉంది. 5,000 ఎంఏహెచ్ సామర్థ్యం కలిగిన బ్యాటరీ కలిగిన ఈ ఫోన్‌ను 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. నోబుల్ బ్లాక్, బ్లూమ్ వైట్, లష్ గ్రీన్, ఆక్వా కలర్స్‌లో వస్తున్న వీ30 మోడల్ 8జీబీ ర్యామ్‌లో, 128జీబీ స్టోరేజ్, 256జీబీ స్టోరేజీ, 12జీబీ ర్యామ్‌లో 256జీబీ స్టోరేజీ, 512జీబీ స్టోరేజీ వేరియంట్లలో అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం అంతర్జాతీయంగా కొన్ని మార్కెట్లలో ఉందని, త్వరలో భారత్‌తో పాటు ఇతర ప్రాంతాల్లో ప్రారంభిస్తామని కంపెనీ పేర్కొంది. దీని ధరల వివరాలను త్వరలో వెల్లడించనున్నట్టు కంపెనీ పేర్కొంది.

Tags:    

Similar News