బంగాళాదుంపతో ఫోన్‌కి ఛార్జింగ్.. వీడియో వైరల్.. నిజం ఏంటో తెలుసా..
మీరు ఎప్పుడైనా మీ ఫోన్ బ్యాటరీ అయిపోయినప్పుడు, సమీపంలో చార్జింగ్ సౌకర్యం లేనప్పుడు చాలా టెన్షన్ పడతూఉంటారు.
దిశ, ఫీచర్స్ : మీరు ఎప్పుడైనా మీ ఫోన్ బ్యాటరీ అయిపోయినప్పుడు, సమీపంలో చార్జింగ్ సౌకర్యం లేనప్పుడు చాలా టెన్షన్ పడతూఉంటారు. ఇలాంటి సమయంలో చాలామంది ఈ సమస్యను పరిష్కరించేందుకు మార్గాలు ఎంచుకుంటూ ఉంటారు. అయితే ఈ మధ్య కాలంలో బంగాళదుంపలతో మీ ఫోన్‌ను ఛార్జ్ చేయవచ్చని సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. అత్యవసర పరిస్థితుల్లో ఈ ఐడియా తమకు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుందని చాలా మంది నమ్ముతున్నారు. అయితే ఈ వీడియోలో ఎంత వరకు నిజం ఉందనేది చాలా మందికి తెలిసి ఉండదు.
బంగాళాదుంప ఒక సహజ ఎలక్ట్రోలైట్ అని అందరికీ తెలుసు. అంటే విద్యుత్ ప్రవాహం బంగాళదుంప ద్వారా సులభంగా ప్రయాణించగలదు. దీని ద్వారా మనం కూడా ఫోన్‌ని ఛార్జ్ చేయగలమా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి ? అయితే ప్రస్తుతం వైరల్ అవుతన్న వీడియోలో బంగాళదుంప, కోకాకోలా సాయంతో ఫోన్ ఛార్జ్ అయినట్లు చూపించారు .
బంగాళాదుంపతో ఫోన్ ఛార్జింగ్ వీడియో
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో, ఒక వ్యక్తి ఒక గిన్నెలో బంగాళాదుంపలను పెడతాడు. దీని తర్వాత, కోలా - కోలా బంగాళదుంప పైన పోస్తారు. తర్వాత ఫోన్ ఛార్జర్ బంగాళాదుంప లోపలికి పెట్టి ఫోన్ కు చార్జింగ్ పిన్ కనెక్ట చేస్తారు. వెంటనే ఫోన్ ఛార్జింగ్ ఎక్కుతుంది.
వైరల్ వీడియోలో నిజం ఎంత..
ఈ వీడియోలో రెండు ఛార్జర్‌లు ఉపయోగించారు. అయితే రెండు కేబుల్‌లను ఒకటిగా చూపించే ప్రయత్నం చేశారు. దీనిలో, ఒక ఛార్జర్ బంగాళాదుంపకు అనుసంధానించి ఉంటుంది. కానీ విద్యుత్తు వచ్చే కేబుల్ మరొక ఛార్జర్ నుండి వస్తుంది. రెండవ ఛార్జర్ సాకెట్‌కు కనెక్ట్ చేసి ఉంది. ఇది వాస్తవానికి ఫోన్‌ను ఛార్జ్ చేస్తుంది. బంగాళదుంపలో అమర్చిన ఛార్జర్ ఫోన్‌కు ఛార్జింగ్ కావడం లేదు.
ఇలా చేస్తే ఏమి జరుగుతుంది ?
ఇది పూర్తిగా నకిలీ వీడియో, ఇందులో వీడియోను షూట్ చేస్తున్నప్పుడు చిన్న ట్రిక్ ఉపయోగించి రెండు కేబుల్‌లను ఒక కేబుల్‌గా చూపుతారు. మీరు ఇలా బంగాళదుంపలతో ఫోన్‌ను ఛార్జ్ చేయలేరు. ఇలా చేయడానికి ప్రయత్నిస్తే ఛార్జర్ పిన్ పాడయ్యే ప్రమాదం ఉంది. అందువల్ల, అత్యవసర పరిస్థితుల్లో ఫోన్‌ను ఛార్జ్ చేయడానికి పవర్ బ్యాంక్ ఉత్తమ ఎంపిక. రుచికరమైన వంటకాల తయారీకి మాత్రమే బంగాళాదుంపలను ఉపయోగించండి.