Tech Tips: మీ మొబైల్ ఆన్‌లో ఉండగానే ఎదుటివారికి స్విచాఫ్ రావాలా? ఈ సెట్టింగ్ మీకోసమే

చిన్నా పెద్దా తేడా లేకుండా ప్రస్తుత రోజుల్లో స్మార్ట్ ఫోన్‌కు ఎంతగా అడిక్ట్ అవుతున్నారో స్పెషల్‌గా చెప్పాల్సిన అక్కర్లేదు.

Update: 2024-08-17 09:14 GMT

దిశ, ఫీచర్స్: చిన్నా పెద్దా తేడా లేకుండా ప్రస్తుత రోజుల్లో స్మార్ట్ ఫోన్‌కు ఎంతగా అడిక్ట్ అవుతున్నారో స్పెషల్‌గా చెప్పాల్సిన అక్కర్లేదు. ఒక్క పూట అన్నం లేకుండా అయినా ఉంటారు కానీ చేతిలో మొబైల్ లేకపోతే మాత్రం కనీసం ఊపిరి కూడా పీల్చుకోలేని పరిస్థితులు నెలకొన్నాయి. స్మార్ట్ ఫోన్ అంటే అంతలా పడి చస్తున్నారు మరీ జనాలు. అయితే ఇంత ప్రియారిటీ ఇచ్చే ఫోన్లో అనేక ఫీచర్స్ ఉంటాయి. పలు రకాల ప్రైవసీ సెట్టింగ్స్ ఉంటాయి. కాగా మనం ఓ పనిలో నిమగ్నమైనప్పుడు ఎవరైనా కాల్ చేస్తే లిఫ్ట్ చేయలేని పరిస్థితులు ఉంటాయి. ఆ సమయంలో ఎదుటివారి ఫోన్‌ను కట్ చేయలేం. కాగా మొబైల్ ఆన్‌లో ఉన్నా స్విచ్ ఆఫ్ అయినట్లు ఫోన్ లో ఉన్నట్లు రావాలంటే దీనికి ఓ సొల్యూషన్ ఉంది. ఆ ట్రిక్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ముందుగా కాల్స్ సెట్టింగ్‌లోకి వెళ్లండి. నెక్ట్స్ సప్లిమెంటరీ సర్వీసెస్‌ను నొక్కండి. తర్వాత డిఫాల్ట్ ఆన్ చేసి ఉన్న కాల్ వెయిటింగ్ ఆప్షన్ మనకు కనిపిస్తుంది. దాన్ని ఆఫ్ చేసేయండి. నెక్ట్స్ కాల్ ఫార్వార్డింగ్ ను నొక్కి.. వాయిస్ కాల్స్, వీడియో కాల్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. అలాగే వీటితో పాటు ఫార్వర్డ్ అండ్ ఫార్వర్డ్ వెన్ బిజీ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. అక్కడ ఎవరి ఫోన్ అయితే సమాధానం ఇవ్వాలనుకోవట్లేదో వారి మొబైల్ నెంబర్ నమోదు చేయండి. అంకెలు పొందుపరిచిన తర్వాత ఎనేబుల్ ను క్లిక్ చేయండి. అంతే.. ఇక మీ ఫోన్ ఆన్‌లో ఉన్న మీకు కాల్ చేసేవారికి స్విచాఫ్ వస్తుంది.

Tags:    

Similar News