వెంటనే బ్రౌజర్‌ను అప్‌డేట్ చేయమని హెచ్చరిస్తున్న ఎమర్జెన్సీ రిపోర్ట్ టీమ్

సెర్చింజన్ సైట్ మైక్రోసాఫ్ట్ వాడుతున్న వినియోగదారులకు కేంద్రం తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది.

Update: 2022-11-30 10:25 GMT

దిశ, వెబ్‌డెస్క్: సెర్చింజన్ సైట్ మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ వాడుతున్న వినియోగదారులకు కేంద్రం తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ప్రస్తుత ఉపయోగిస్తున్న బ్రౌజర్ వెర్షన్‌‌లో లోపాలను గుర్తించినట్లు తెలిపింది. దీని ఆధారంగా డేటా చోరి కి గురయ్యే ప్రమాదం ఉందని, 107.0.1418.62 కంటే ముందు బ్రౌజర్ వెర్షన్‌ను ఉపయోగిస్తున్న మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ వినియోగదారులు వెంటనే బ్రౌజర్‌ను అప్‌డేట్ చేసుకోవాలని ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రిపోర్ట్ టీమ్ (CERT-In) పేర్కొంది.


GPUలో హీప్ బఫర్ ఓవర్‌ఫ్లో కారణంగా బ్రౌజర్‌లో ఉన్న బగ్‌తో హ్యాకర్స్ రిమోట్ మోడ్ అటాకర్ ద్వారా కంప్యూటర్‌లోకి చొరబడి సిస్టమ్‌‌పై దాడి చేసి డేటాను దొంగలించే అవకాశం ఉంది. దీని బారీ నుండి తప్పించుకోడానికి వెంటనే వినియోగదారులు తమ మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బ్రౌజర్‌ను అప్‌డేట్ చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది.


Similar News