BSNL:మొరాయిస్తున్న బీఎస్ఎన్ఎల్ సెల్ వన్ సేవలు..??

గత కొద్దిరోజులుగా బీఎస్ఎన్ఎల్ సెల్ వన్ సేవలు మోరాయిస్తుండటంతో వినియోగదారులు అవస్థలు పడుతున్నారు.

Update: 2024-07-14 10:41 GMT

దిశ, అమలాపురం:గత కొద్దిరోజులుగా బీఎస్ఎన్ఎల్ సెల్ వన్ సేవలు మోరాయిస్తుండటంతో వినియోగదారులు అవస్థలు పడుతున్నారు. ఈ విషయాలపై స్థానిక టెలికాం శాఖ అధికారుల వద్ద ఫిర్యాదు చేసిన స్పందన ఉండటం లేదని వినియోగదారులు వాపోతున్నారు. ఎన్నికలకు ముందు బాగా పని చేసిన బిఎస్ఎన్ఎల్ సేవలు..ఫలితాల అనంతరం బాగా మొరాయిస్తున్నాయని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొందరు ఏకంగా బిఎస్ఎన్ఎల్ నుంచి ఇతర సేవలు వైపు దృష్టి పెట్టడం జరుగుతోంది.

ప్రస్తుతం జియో, ఎయిర్టెల్ తదితర ప్రైవేట్ సంస్థలు నెట్ చార్జీలు విపరీతంగా పెంచడంతో బిఎస్ఎన్ఎల్ బెటర్ అని చర్చ జరుగుతుండగా గ్రామంలో ఏర్పాటు చేసిన సెల్ వన్ టవర్లు చినుకు పడ్డ..విద్యుత్ సరఫరా ఆగిపోతే..ఆయా పరిసరాల్లో సెల్ సేవలు దూరమవుతున్నాయి. కొందరు బిఎస్ఎన్ఎల్ ఉద్యోగులు ప్రైవేటు నెట్ సంస్థలు అండగా నిలుస్తున్నారని, బిఎస్ఎన్ఎల్ ఫ్రీక్వెన్సీ తగ్గించి ప్రైవేట్ సంస్థలకు లబ్ధి చేకూరేలా వ్యవహరిస్తున్నారని , కరెంటు పోయిన సమయంలో జనరేటర్ ఆన్ చేయకుండా వ్యవహరించడం గమనార్హం.ఈ విషయాలపై జిల్లా అధికారులు,ఇతర అధికారులు చర్యలు తీసుకుని సెల్ వన్ సేవలు మెరుగుపరచాలని, పరిస్థితి ఇలాగే కొనసాగితే.. బిఎస్ఎన్ఎల్ సేవల మనుగడ ప్రమాదంగా మారిందని, వినియోగదారులు అభిప్రాయపడుతున్నారు.


Similar News