Asteroid: గమ్యం లేని గ్రహశకలం..భూమి వైపు దూసుకొస్తోందన్న నాసా!

అంతరిక్షంలో ఎన్నో గ్రహశకలాలు సంచరిస్తూ ఉంటాయనే విషయం తెలిసిందే. అయితే అవి తమదైన ఒక గమ్యస్థానంలో.. పరిమిత వేగంతో ప్రయాణం చేస్తుంటాయి.

Update: 2024-06-23 10:13 GMT

దిశ,వెబ్‌డెస్క్: అంతరిక్షంలో ఎన్నో గ్రహశకలాలు సంచరిస్తూ ఉంటాయనే విషయం తెలిసిందే. అయితే అవి తమదైన ఒక గమ్యస్థానంలో.. పరిమిత వేగంతో ప్రయాణం చేస్తుంటాయి. కానీ వీటికి భిన్నంగా ఒక విశాలమైన గ్రహశకలం గమ్యం లేకుండా మన భూమి వైపు దూసుకొస్తోందని నాసా శాస్త్రవేత్తలు వెల్లడించారు. తాజాగా ఈ గ్రహశకలం ఉనికిని గుర్తించినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. అయితే, దీని పరిమాణం ఎంతనేది ఇంకా తెలియరాలేదు. భూమిని ఢీకొట్టే ముప్పు మాత్రం 72 శాతం ఉందని చెబుతున్నారు.

ప్రాథమిక అంచనాల ప్రకారం ఈ గ్రహశకలం 2038 జులై 12న భూమిని ఢీ కొట్టే ప్రమాదం ఉందని వివరించారు. ప్రస్తుతానికి ఈ ముప్పును తప్పించేందుకు నాసా దగ్గర ఎలాంటి మార్గం లేదని పేర్కొన్నారు. అంతరిక్షంలోని గ్రహశకలాల వల్ల మన భూమికి ఏర్పడే ముప్పును అంచనా వేయడం, ముప్పును తప్పించేందుకు అనుసరించాల్సిన వ్యూహాల కోసం శాస్త్రవేత్తలు డబుల్ ఆస్టరాయిడ్ రీడైరెక్షన్ టెస్ట్ (డార్ట్) మిషన్ ను ఆవిష్కరించారు. ఈ విధానం ద్వారానే ప్రస్తుత ముప్పును గుర్తించినట్లు నాసా శాస్త్రవేత్తలు తెలిపారు.

Similar News